విజయ్ సేతుపతి తో మంజు వారియర్

టాలెంటెడ్ పీపుల్ అంతా ఒక సినిమాలో నటిస్తే ఆ కిక్కే వేరు.అలాంటప్పుడు పాత్రలు తప్ప ఆర్టిస్టులు కనిపించరు. ఇలాంటివి చూపించడంలో తమిళ్ మేకర్స్ ఎప్పుడూ బెస్ట్ అనిపించుకుంటారు. ఇక ఆర్టిస్టులతోనే కథల్లోనూ ఓ సహజత్వాన్ని చూపించే దర్శకుడు వెట్రిమారన్. వెట్రిమారన్ సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అని అందరికీ తెలుసు. అతను ఎంచుకునే కథలు కూడా ఎవరి ఊహకు అందవు. వాటిని అంతే సీరియస్ గా, సిన్సియర్ గా సెల్యూలాయిడ్ పైకి తీసుకువస్తాడు. ఈ కారణంగానే వెట్రిమారన్ సినిమాలకు కలెక్షన్స్ తో పాటు అవార్డ్స్ కూడా వస్తుంటాయి.


వెట్రిమారన్ గత సినిమా విడుదలై1. మొన్నటి వరకూ కమెడియన్ గా ఉన్న సూరిని హీరోగా పెట్టి రూపొందించిన ఈ సినిమా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.90ల కాలంలో సాగిన కథగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆటైమ్ లో తమిళనాడులోని కొందరు తిరుగుబాటు దారులను పట్టుకోవడానికి ప్రభుత్వం పోలీస్ క్యాంప్ ను ఏర్పాటు చేస్తుంది. ఆ క్యాంప్ లో డ్రైవర్ గా ఉన్న సూరి ఆ తిరుగుబాటు దారుల నాయకుడిని పట్టుకుంటాడు.ఎంతోమంది పోలీస్ లు ఉన్నా.. తనే లీడ్ చేస్తాడు. అది హీరోయిక్ గా కాకుండా నేచురల్ గా ఉండేలా చూసుకున్నాడు వెట్రీమారన్. అయితే ఈ కథలో ఆ విప్లవకారుడు పాత్రలో కనిపించింది విజయ్ సేతుపతి. అతని పాత్ర క్లైమాక్స్ లోనే వస్తుంది. అతనెవరు.. ఎందుకు విప్లవం మొదలుపెట్టాడు అనేది సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నాడు. ఈ సెకండ్ పార్ట్ లోనే విజయ్ సేతుపతి సరసన మంజువారియర్ ను తీసుకున్నాడు. మళయాలీ నటి అయిన మంజు మోస్ట్ టాలెంటెడ్ అని ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది.


వెట్రిమారన్ ఇంతకు ముందు తీసిన అసురణ్ లోనూ మంజు వారియర్ ధనుష్ సరసన నటించింది. ఆ పాత్రకు ఓ నిండుదనం వచ్చిందంటే తన నటన వల్లే అనుకోవచ్చు. అలాంటి నటిని మరోసారి ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లోకి తీసుకున్నాడు అంటే ఇంక చెప్పేదేముందీ.. మంజు వారియర్ ఎంట్రీతో ఈ మూవీకి మరింత వెయిట్ వస్తుంది.విజయ్ సేతుపతితో తను నటించడం ఇదే ఫస్ట్ టైమ్. సో.. ఈ కథ వీరి నటనతో ఖచ్చితంగా నెక్ట్స్ లెవల్ కు వెళుతుందనుకోవచ్చు.

Related Posts