పవన్ కళ్యాణ్‌ కు అల్లు అర్జున్ పై అంత కోపమా

పవన్ కళ్యాణ్‌ అంటే మెగా ఫ్యామిలీ మొత్తంలో కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో. అఫ్‌ కోర్స్ మెగాస్టార్ స్థానం ఎప్పుడూ అలాగే ఉంటుందనుకోండి. ఇక మెగా ట్యాగ్ తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తనకంటూ ఓ రేంజ్ వచ్చిన తర్వాత ఈ ట్యాగ్ ను వదిలించుకున్నాడు. అల్లు అనే బ్రాండ్ నే బిల్డ్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో తన ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనే ఒక వర్గీకరణ కూడా వచ్చేసింది. అల్లు ఫ్యాన్స్ అంటే ఆర్మీ అన్నాడు. ఇటు మెగాఫ్యాన్స్ అలాగే ఉండిపోయారు. కొన్నాళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్‌ గురించి చెప్పమని ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తే “చెప్పను బ్రదర్” అన్నాడు. అంతే ఆ మాట ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్‌ ను పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. ఇక్కడే మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచే ఇద్దరూ వేరయ్యారు.


అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కూడా సందర్భ శుద్ధి లేకుండా ఫంక్షన్ ఏదైనా పవన్ కళ్యాణ్‌.. పవన్ కళ్యాణ్‌ అని అరవడంతో పాటు ఆయా ఫంక్షన్స్ ను బాగా ఇరిటేట్ చేశారు.. చేస్తున్నారు కూడా. ఇది చిరంజీవికి సైతం తప్పని ఇబ్బంది. అందుకే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఓ పొలిటికల్ ఇష్యూలో మళ్లీ పవన్ కు సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్. అయినా ఎందుకో వీరి మధ్య గ్యాప్ బలంగానే ఉంది.


ఇక బ్రో మూవీ ఫంక్షన్ తో పాటు కొన్నాళ్ల క్రితం ఓ పొలిటికల్ స్పీచ్ లో కూడా అతను ఇండస్ట్రీలో టాప్ హీరోలు అంటూ మహేష్‌ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పేర్లు చెప్పాడు కానీ అల్లు అర్జున్ పేరు చెప్పలేదు. నిన్నటి బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్, రానాలాగా కండలు పెంచలేను, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లా డ్యాన్సులు చేయలేను అన్నాడు.

మామూలుగా టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో అల్లు అర్జున్ కూడా ఉంటాడు. అయినా అతన్ని వదిలేశాడు. చూస్తోంటే పవన్ కళ్యాణ్‌ కు అల్లు అర్జున్ పై ఇంకా కోపం తగ్గనట్టుగానే ఉంది. ఒకవేళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం ఎందుకూ అనుకుంటే రామ్ చరణ్‌ పేరు చెప్పాడు కదా. సో.. అప్పుడు అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పేరు ఉచ్చరించడం కూడా మానేశాడు బ్రదర్స్.

Related Posts