రాజకీయ చైతన్యం కలిగించేలా ‘ప్రతినిధి 2’ ట్రైలర్

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి పెరిగింది. ఈనేపథ్యంలో.. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించేలా వస్తోంది ‘ప్రతినిధి 2’ చిత్రం. నారా రోహిత్ హిట్ మూవీ ‘ప్రతినిధి’కి సీక్వెల్ గా రూపొందిన చిత్రమిది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు.. ఎంతమంది గుండెపోటుతో చచ్చారు..’ అనే ఆలోచింపజేసే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో రోహిత్ కనిపించబోతున్నాడు. అతను పొలిటీషియన్ అజయ్ ఘోష్ ని ఇంటర్యూ చేసినప్పుడు.. అతను చెప్పే ‘కొండమీద కొబ్బరికాయలు అమ్మా.. బండి మీద బత్తాయిలు అమ్మా.. ‘ అనే డైలాగ్స్ కూడా ప్రెజెంట్ పొలిటీషియన్స్ కు అద్దం పట్టేలా ఉన్నాయి. సిరీ లీల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఉదయ్ భాను వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాని వానర ఎంటర్ టైన్ మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కుమార రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ 25న ‘ప్రతినిధి 2’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts