ఒకే ఫ్రేములో తళుక్కుమన్న మహేష్-రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేయబోతున్నాడనేది పదేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికి ఈ క్రేజీ కాంబో సెట్టయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ కి సంబంధించి చర్చా వేదికల్లో పాల్గొంటున్నారు హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం మహేష్, రాజమౌళి ఇద్దరూ కలిసి దుబాయ్ వెళ్లారు. లేటెస్ట్ గా వీరిద్దరూ దుబాయ్ నుంచి తిరిగి వస్తోన్న వీడియోస్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్‘ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబు తోనే ఫిక్సయ్యాడని అందరికీ తెలిసిందే. కానీ.. మహేష్, రాజమౌళి కలుసుకున్న సందర్భాలు మాత్రం బయటకు రాలేదు. గతంలో ఎప్పుడో ‘బిజినెస్ మ్యాన్‘ ఈవెంట్ లో వీరిద్దరినీ చూసిన ప్రేక్షకులు.. మళ్లీ ఇప్పుడు ‘ఎస్.ఎస్.ఎమ్.బి. 29‘ కోసం దుబాయ్ నుంచి తిరిగి వస్తోన్న వేళ వీరిని ఒకే ఫ్రేములో చూసే అవకాశం వచ్చింది. వీరితో పాటు నిర్మాత కె.ఎల్.నారాయణ కూడా ఉన్నారు. త్వరలోనే.. మహేష్-రాజమౌళి సినిమా గ్రాండ్ లెవెల్ లో ముహూర్తాన్ని జరుపుకుని షూటింగ్ మొదలుపెట్టుకోనుంది.

Related Posts