లాంగ్ లీవ్ కు మహేష్‌ బాబు

మహేష్‌ బాబు అంటే టాలీవుడ్ లో కంప్లీట్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీని ఆనందంగా ఉంచేందుకు ఏదైనా చేస్తాడు. ముఖ్యంగా పిల్లలతో ఆయన స్పెండ్ చేసే టైమ్ చూస్తే చాలామందికి అసూయ కలుగుతుంది.

ఏ చిన్న అకేషన్ దొరికినా వెంటనే వెకేషన్ అనేస్తాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ షూటింగ్స్ కు బ్రేక్ వస్తుంది. అయితే ఇవన్నీ కేవలం ఒక వారం రోజుల్లోనే ఫినిష్‌ చేసుకుంటాడు.

మళ్లీ వెంటనే లొకేషన్ లో అడుగుపెడుతుంటాడు. అయితే ఈ సారి ఇంపార్టెంట్ మూవీ ఉన్నా.. ఎక్కువ రోజులు వెకేషన్ కు వెళుతున్నాడు. ఈ 20 న మహేష్‌ బాబు కూతురు సితార బర్త్ డే. బర్త్ డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఆ బర్త్ డే హాలిడేస్ ను మాత్రం లాంగ్ డేస్ షెడ్యూల్ గా ఫిక్స్ చేసుకున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఇంపార్టెంట్ సీక్వెల్ షూటింగ్ లో ఉన్నాడు.

ఇది ఓ రెండు మూడు రోజుల్లో అయిపోతుంది. ఆ తర్వాత 23 లేదా 24 నుంచి దుబాయ్ లేదా పారిస్ కు వెకేషన్ కు వెళుతున్నాడు. ఈ మేరకు ప్లానింగ్స్ అయిపోయాయి. అయితే ఈ సారి ఏకంగా 20 రోజుల పాటు హాలిడేస్ తీసుకుంటున్నాడట.

త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తూ.. ఇంత లాంగ్ లీవ్ అంటే ఆశ్చర్యమే. అయితే మహేష్‌ లేని రోజుల్లో ఆయన లేని సీన్స్ ను చిత్రీకరించేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడట.

ఆయన రాగానే ఇంక గ్యాప్ లేకుండా సినిమాను పూర్తి చేస్తారు అంటున్నారు. సో.. మళ్లీ గుంటూరు కారం సెట్ లో మహేష్‌ అడుగుపెట్టేది ఆగస్ట్ ఆఖరి వారంలోనే అనుకోవచ్చు.

Related Posts