గ్లామర్ రోల్ తో కీర్తి సురేష్‌ బాలీవుడ్ ఎంట్రీ

సౌత్ లో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో ఫస్ట్ సూపర్ హిట్ నేను శైలజ తో ఫేమ్ అయ్యి ప్రస్తుతం సౌత్ మొత్తం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది కీర్తి సురేష్‌. మహానటి మూవీతో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ఈ బ్యూటీ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ రోల్స్ కు దూరంగానే ఉంటుంది.

కొన్నాళ్ల క్రితం విక్రమ్ తో చేసిన ఓ సినిమాలో మాత్రమే కాస్త స్పైసీగా కనిపించింది. ఆ తర్వాత దానికీ ఫుల్ స్టాప్ పెట్టింది. మహేష్‌ బాబుతో చేసిన సర్కారువారి పాట కూడా గ్లామర్ రోలే. కానీ చాలా హద్దుల్లోనే ఉంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్నాళ్లుగా సౌత్ బ్యూటీస్ అంతా బాలీవుడ్ వైపు పరుగులు పెడుతున్నారు. కీర్తి సురేష్‌ కు గతంలోనే అక్కడి నుంచి ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు నో చెప్పింది. బట్ ఇప్పుడు ఓకే అనేసింది.


బాలీవుడ్ యంగ్ స్టర్ వరుణ్‌ ధావన్ సరసన కీర్తి సురేష్‌ బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది. ఈ సినిమాలో కీర్తి చేయబోతోంది గ్లామర్ తో పాటు యాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రట. బాలీవుడ్ లో గ్లామర్ కురిపించడం అంటే ఏంటో అందరికీ తెలుసు. మరీ ఆ రేంజ్ లో కనిపించకపోయినా ఇప్పటి వరకూ తనను చూసిన దానికి భిన్నంగా ఉంటుందని మాత్రం చెబుతున్నారు.

పైగా ఇలాంటి పాత్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తేనే తన కెరీర్ అక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుందనే ప్లానింగ్ తో ఉందట. ఆ మేరకే ఈ సినిమా సైన్ చేసినట్టు సమాచారం. విశేషం ఏంటంటే.. ఇది పూర్తిగా తమిళ్ మేకర్స్ రూపొందిస్తోన్న సినిమా. కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన అట్లీ నిర్మించబోతోన్న ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్ట్ చయబోతున్నాడు. ఇతను ఇంతకు ముందు జీవాతో కీ అనే సినిమా తీశాడు.


వచ్చే నెల నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. కంప్లీట్ కమర్సియల్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 2024 మార్చి 31న విడుదల చేయాలనే ప్లానింగ్ తో షెడ్యూల్స్ చేసుకున్నారట. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది చెప్పలేం కానీ.. మొత్తంగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న కీర్తి సురేష్‌ బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. మరి అక్కడ తన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts