ఎన్టీఆర్ దూకుడు అభిమానుల కోసమేనా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి అభిమానుల్లో ఓ అసంతృప్తి ఉంది. 2018లో అరవింద సమేత వీరరాఘవ తర్వాత మరో సినిమా కోసం నాలుగేళ్లకు పైగా టైమ్ పట్టింది. అఫ్‌ కోర్స్ ఇందులో మేజర్ పార్ట్ కోవిడ్ వల్ల ఆలస్యం అయింది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ ఇక వరుసగా సినిమాలు చేస్తాడు అనుకుంటే నెక్ట్స్ ప్రాజెక్ట్ కు మళ్లీ రెండేళ్ల టైమ్ పడుతోంది. అయితే పెరిగిన తన ఇమేజ్ కు తగ్గ కథ కోసం ఇంత ఆలస్యం అయింది.

కొరటాల శివ డైరెక్షన్ లోదేవరగా రాబోతోన్న ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి ” వార్ 2″ మూవీ చేయబోతున్నాడు. దీనికి ముందే ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయి ఉంది. బట్ ముందుగా చేయబోయేది మాత్రం వార్2నే. ఈ సెప్టెంబర్ లేదా నవంబర్ నుంచి వార్ 2 సెట్స్ పైకి వెళుతుంది. ఈ లోగా దేవరకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలని అదే పనిగా హార్డ్ వర్క్‌ చేస్తున్నాడు. ఇప్పటికే మూడు భారీ షెడ్యూల్స్ పూర్తయిందీ మూవీ. రీసెంట్ గా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారు. నైట్ మోడ్ లో వెన్నెల వెలుగులో సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ ఫైట్ సీన్ షూట్ చేశారు. ఇక ఇప్పుడు మరో భారీ యాక్షన్ సీన్ కు రెడీ అయ్యాడు ఎన్టీఆర్.


సాల్మన్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించబోతోన్న ఈ యాక్షన్ సీన్ షూటింగ్ ఇవాళ్టి(బుధవారం) నుంచి స్టార్ట్ అవుతోంది. ఓ స్టార్ హీరో ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్షన్ సీన్స్ లో పార్టిసిపేట్ చేయడం అరుదుగా ఉంటుంది. ఎంత కాదనుకున్నా.. ఇలాంటి ఫైట్స్ టైమ్ లో వాళ్లు శారీరంగా ఒళ్లు హూనం చేసుకుంటారు. అందుకే ఒక ఫైట్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి కొన్ని సీన్స్ లేదా పాటలు షూట్ చేసుకుంటారు. అటుపై మళ్లీ ఫైట్స్ అంటారు. బట్ ఎన్టీఆర్ అలా కాదు.

ఇంపార్టెంట్ అనుకున్న సీన్స్ ను ఏ మాత్రం గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ స్పీడ్ లో చేసుకుంటూ వెళుతున్నాడు. దేవర షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే అతను నెక్ట్స్ వార్ 2 లో జాయిన్ అవుతాడు. అటుపై ఓ మూడు నెలల గ్యాప్ లోనే మళ్లీ ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది.

సో.. ఎలా చూసినా నెక్ట్స్ ఇయర్ యంగ్ టైగర్ నుంచి రెండు సినిమాలు ఖచ్చితంగా విడుదలవుతాయి. అలా ఇప్పటి వరకూ వచ్చిన గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్‌ నింపబోతున్నాడు.

Related Posts