టాలీవుడ్

మహేష్ బాబు హీరోయిన్లు సాయితేజ్ తో

ఒక సినిమాలో నటించే హీరోయిన్లు మరో సినిమాలో కలిసి నటించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇదేమీ అరుదైన విషయం కాదు. కానీ ఈ మధ్య కాలంలో కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే చేస్తోన్న సినిమాలోనే మనస్ఫర్థల కారణంగా ప్రాజెక్ట్ నే వదిలిపోయిన హీరోయిన్.. ఆమెను పట్టించుకోకుండా అదే ప్రాజెక్ట్ లో ఉన్న హీరోయిన్ కు మరో సినిమా అవకాశం వస్తే.. ఎలా ఉంటుంది.

ఇది కాస్త రేర్ కేస్ అనే చెప్పాలి. ప్రస్తుతం అలాంటిదే జరుగుతోంది టాలీవుడ్ లో. మరి ఈ భామలెవరో తెలుసా..? పూజాహెగ్డే, శ్రీ లీల. స్టార్డమ్ ఉన్నప్పుడు ఆఫర్స్ ఆగుతాయా..? కొన్నిసార్లు మాత్రం టైమ్ కలిసి రాదు. ప్రస్తుతం ఆ పరిస్థితిలోనే ఉంది పూజాహెగ్డే. అమ్మడు మహేష్‌ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ గుంటూరు కారం నుంచి తప్పుకుంది.

అయితే ఇదే టైమ్ లో మరో యంగ్ హీరోతో నటించే ఛాన్స్ కూడా వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఇదే కథ శ్రీ లీలకు కూడా వినిపించాడు సదరు దర్శకుడు. ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చేస్తారు అనేదే తేలాలి. లేదా ఇద్దరూ రిజెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. విశేషం ఏంటంటే.. ఆ దర్శకుడు ఈ ఇద్దరికీ కథ చెప్పినా తన సినిమాలో కావాల్సింది ఒక్క హీరోయిన్నేనట. మరి ఆ దర్శకుడు, హీరో ఎవరో గెస్ చేశారా..?


విరూపాక్షతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు సాయితేజ్. ఇది అతని కెరీర్ లోనే బెస్ట్ హిట్. పైగా ప్రాణాంతక ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత చేసిన సినిమా. బలమైన కంటెంట్ తో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ తర్వాత సాయితేజ్ ఈ సారి మాస్ మూవీతో రాబోతున్నాడు. ఇందుకోసం తమ మెగా కాంపౌండ్ లోనే రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసిన సంపత్ నంది చెప్పిన కథకు ఓకే చెప్పాడు. సంపత్ నంది సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ బానే ఉంటాయి.

దానికి సరైన కథ కూడా పడితే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అలాంటి కథే సాయితేజ్ కు చెప్పాడట. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లలోఎవరో ఒకరు ఓకే చెబితే వెంటనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో షూటింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకుంటారట. వీళ్లు కాదు అన్నా.. మరో ఆప్షన్ ఏదో ఉండే ఉంటుంది కదా..? ఈ చిత్రానికి గోలి శంకర్ అనే టైటిల్ ను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ముందుగా గాంజా శంకర్ అనుకున్నారట. కానీ గంజాయిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.. తర్వాత సెన్సార్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని గోలి శంకర్ అనే మాస్ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. సో.. శ్రీ లీల, పూజాహెగ్డే.. వీరిలో సాయితేజ్ తో రొమాన్స్ చేయబోయేది ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

44 mins ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

51 mins ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

1 hour ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago