‘మధురము కదా ‘ అని పాడుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’

విజయ్‌ దేవరకొండ లైగర్‌ ఫ్లాప్‌ తర్వాత ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కంటెంట్‌ పై దృష్టిపెట్టాడనొచ్చు. అలాంటి కూల్‌ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్న బ్లాక్‌బస్టర్‌ కంటెంట్‌ ఫ్యామిలీస్టార్‌ అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీత గోవిందం డైరెక్టర్‌ పరశురామ్‌ డైరెక్షన్‌ చేసారు. ఈ చిత్రం నుంచి రిలీజయిన ప్రతీ ప్రమోషనల్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. గతంలో రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్‌ కాగా.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్‌ రిలీజ్‌ చేసారు.

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ వేల్యూస్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్టు గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. మంచి మ్యూజికల్ హిట్ అని రిలీజయిన ‘నందనందనా’, కళ్యాణి వచ్చా’ సాంగ్స్ ప్రూవ్ చేసాయి. ఇప్పుడు ‘మధురము కదా’ అనే సాంగ్ రిలీజ్‌ చేసారు. శ్రీమణి రాసిన ఈ పాటను శ్రేయాఘోషల్‌ పాడారు. గోపీసుందర్ స్వరపర్చిన ఈ పాట ఫాస్ట్‌ బీట్‌ టచ్‌ తో క్లాసిక్‌ ఫ్లేవర్ మిక్స్‌ చేసి అర్ధవంతంగా , ఆహ్లాదకరంగా .. వినగానే శ్రోతలను ఆకట్టుకుంటోంది. అలాగే విజువల్ గా కూడా చాలా బాగుంది.


“ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts