‘మ్యాడ్‘ రెస్పాన్స్ మామూలుగా లేదు

సినిమాని ప్రేమించే వాళ్లలో యువత ఎక్కువగా ఉండడంతో.. సీజన్, అన్ సీజన్ తో సంబంధం లేకుండా యూత్ ఫుల్ కాలేజ్ స్టోరీస్ కి ఎప్పుడూ ఆదరణ దక్కుతూనే ఉంటుంది. కాలేజ్ లైఫ్, అక్కడ లవ్ స్టోరీస్, గొడవలు, ఫన్ ఎలిమెంట్స్ తో రూపొందే సినిమాలలో యువత తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. అయితే యూత్ ఫుల్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎన్ని వచ్చినా వాటిలో విజయాలు సాధించే శాతం చాలా తక్కువ.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలలో ‘హ్యాపీడేస్‘ను ఎక్కువగా ప్రస్తావిస్తాం. ఇప్పుడు అలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన ‘మ్యాడ్‘ మూవీకి రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మ్యాడ్‘ మూవీ ఈ వారం విడుదలైన చిత్రాల్లోనే ది బెస్ట్ అనే కాంప్లిమెంట్స్ అందుకుంటుంది.

ముగ్గురు అబ్బాయిలు.. ముగ్గురు అమ్మాయిల కాలేజ్ లైఫ్, లవ్ స్టోరీస్ ఇతివృత్తంతో రూపొందిన ‘మ్యాడ్‘ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయవిహారం చేస్తుంది. నటుల విషయానికొస్తే ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యాడు. అలాగే దివంగత శోభన్ తనయుడు.. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కి కూడా ఇదే తొలి చిత్రం. మరో ముఖ్య పాత్రలో రామ్ నితిన్ నటించాడు. సినిమాల్లో వీళ్లు పోషించిన మనోజ్, అశోక్, దామోదర్ పేర్లతోనే ఈ చిత్రానికి ‘మ్యాడ్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

లీడ్ మేల్ యాక్టర్స్ తో పాటు.. లీడ్ ఫీమేల్ యాక్టర్స్ శ్రీగౌరిప్రియారెడ్డి, అనంతిక‌, గోపిక ఉద్యాన్‌ లు కూడా తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఇక యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.. ముగ్గురు స్నేహితుల జీవితాలు, వారి ల‌వ్ స్టోరీస్‌ ను పూర్తిగా ఎంటర్ టైనింగ్ వే లో ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు.

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీయెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ‘మ్యాడ్‘ మూవీ వచ్చింది. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమయ్యారు. అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తరపున త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కూడా ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మొత్తంమీద.. ఈ వారం టఫ్ కాంటిటేషన్ మధ్య వచ్చిన ‘మ్యాడ్‘ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషమే.

Related Posts