లక్కీ భాస్కర్‘ టీజర్.. ఎ కామన్ మ్యాన్ స్టోరీ

కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా.. పలు భాషల్లో కథానాయకులుగా సత్తా చాటే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఒకడు. మాతృభాష మలయాళంతో పాటు.. తెలుగు, తమిళం, హిందీలలోనూ హీరోగా దుమ్మురేపుతున్నాడు దుల్కర్. ఈకోవలోనే.. తెలుగులో ‘మహానటి, సీతారామం‘ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఇప్పుడు ‘లక్కీ భాస్కర్‘లో నటిస్తున్నాడు.

ధనుష్ ‘సార్‘ వంటి సక్సెస్ ఫుల్ వెంచర్ తర్వాత వెంకీ అట్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో దుల్కర్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జూలైలో విడుదలకు ముస్తాబవుతోన్న ‘లక్కీ భాస్కర్‘ నుంచి టీజర్ రిలీజయ్యింది. పీరియడిక్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ గా దుల్కర్ కనిపించబోతున్నాడు. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అక్కౌంట్లో భారీగా డబ్బులు రావడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. అలాగే.. ‘మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్.. మేమింతే. కష్టం వస్తే.. ఖర్చులు తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం.. పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా ఖర్చుపెట్టేస్తాం సార్..‘ అంటూ దుల్కర్ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలైట్.

Related Posts