గోపీచంద్-శ్రీను వైట్ల సినిమాకి ‘విశ్వం‘ టైటిల్

మాచో స్టార్ గోపీచంద్ – సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ గోపీచంద్ 32 వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ సినిమాకి ‘విశ్వం‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్సయ్యింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్స్ పై టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘విశ్వం‘ నుంచి ఫస్ట్ స్ట్రైక్ పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ విషయానికొస్తే.. కాశ్మీర్ వంటి ప్రదేశంలో గన్ పట్టుకుని.. స్టైలిష్ లుక్ లో ఎంటరయ్యాడు గోపీచంద్. బ్యాక్ గ్రౌండ్ లో చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ ప్లే అవుతుండగా.. ఓ ఫంక్షన్ హడావుడిలో మునిగితేలుతున్న టెర్రరిస్టులను హీరో మట్టుపెడుతున్నట్టు ఈ గ్లింప్స్ లో చూపించారు. చివర్లో ప్రతి బియ్యం గింజపై తినేవాడి పేరుంటుంది అన్న రీతిలో.. వాళ్లందరినీ చంపేసి బిర్యానీ తింటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ బాగుంది.

Related Posts