లోకేష్ కనకరాజ్.. సౌత్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న దర్శకుడు. అతన్నుంచి ఓ సినిమా వస్తోందంటే ఎంటైర్ కంట్రీ ఈగర్ గా చూస్తోంది. ఇక కోలీవుడ్ కు ఇళయదళపతి అనిపించుకున్న విజయ్ సినిమా అంటే అక్కడి నుంచి ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ యావరేజ్ కంటెంట్ అయినా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
బట్ అప్పటికి లోకేష్ కు ఇంత ఇమేజ్ లేదు. అతని రీసెంట్ మూవీ విక్రమ్ దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో లోకేష్ క్రేజ్ కూడా కంట్రీ వైడ్ గా పెరిగింది. ప్రస్తుతం లోకేష్ డైరెక్షన్ లో విజయ్ నటించిన లియో సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 19న విడుదల కాబోతోన్న ఈ సినిమా బిజినెస్ కూడా చుక్కల్లో ఉంది.
తెలుగులో విజయ్ కి భారీ మార్కెట్ లేదు. అయినా ఇక్కడ 25 -30 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అయినా అటు లోకేష్ కూడా ఉండటంతో లియో తెలుగు రైట్స్ కోసం పోటీ భారీగానే ఉంది. ఇక ఈ పోటీలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గెలిచింది.
లియో ను తెలుగులో సితార బ్యానర్ విడుదల చేయడం ఖాయమైంది. అయితే తెలుగు రైట్స్ ను ఎంతకు కొన్నారు అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ ఈ చిత్రాన్ని ఇక్కడ సితార వాళ్లే విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి 23- 25కోట్లు మధ్యలో ఉండొచ్చు అంటున్నారు.
అయితే సితార బ్యానర్ వారికి డిస్ట్రిబ్యూషన్ వైడ్ గా వైడ్ యాంగిల్ లేదు. అందుకే దిల్ రాజు లేదా మరో పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వీరితో కలిసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తంగా ఈ మూవీతో విజయ్ కి తెలుగులోనూ భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ సినిమా సూపర్ హిట్ అయితేనే అనుకోండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…