చిత్ర పరిశ్రమలో చిరంజీవి ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఒకడు. ‘ముఠామేస్త్రి‘లో గ్రూప్ డ్యాన్సర్ గా ఉన్న లారెన్స్ ను ‘హిట్లర్‘తో స్టార్ కొరియోగ్రాఫర్ గా చేశాడు చిరు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు.. లారెన్స్ కొరియోగ్రఫీ ఎంతగానో ప్లస్ అయ్యింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా.. లారెన్స్ కంపోజ్ చేసిన ఎన్నో స్టైలిష్ స్టెప్స్ ఇప్పటికీ ట్రెండీగానే ఉంటాయి.
రాఘవ లారెన్స్.. నటుడిగా, దర్శకుడిగా బిజీ అయిన తర్వాత కొరియోగ్రఫీని బాగా తగ్గించేశాడు. అడపాదడపా మాత్రమే డ్యాన్స్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు. ఈకోవలోనే.. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150‘లో ‘రత్తాలు‘ పాటకు స్టెప్స్ కంపోజ్ చేశాడు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ ‘విశ్వంభర‘ కోసం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడట. చిరు రిక్వెస్ట్ మేరకు ఈ మూవీలో ఓ మంచి మాస్ బీట్ సాంగ్ కు స్టెప్స్ కంపోజ్ చేయనున్నాడట లారెన్స్. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర‘ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. అసలు ఈ…
పదో రోజు లోకి ప్రవేశించినా ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి‘ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన 9 రోజుల్లో ఈ సినిమా…