పోలీస్ పవర్ చూపించనున్న లేడీ ‘సింగమ్‘

బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ రోహిత్ శెట్టి. తన సినిమాల్లో యాక్షన్ ను ఏ రేంజులో చూపిస్తాడో.. కామెడీని కూడా అంతే స్థాయిలో అదరగొడుతుంటాడు. రోహిత్ శెట్టి బాలీవుడ్ లో ఓ కాప్ యూనివర్శ్ నే సృష్టించాడు. ‘సింగమ్, సింగర్ రిటర్న్స్, సింబ, సూర్యవంశి‘ వంటి చిత్రాలు ఈ యూనివర్శ్ లో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి విజయాలు సాధించాయి. ఈకోవలోనే ఇప్పుడు తన ‘సింగమ్‘ సిరీస్ లో ‘సింగమ్ అగైన్‘ మూవీని తీసుకొస్తున్నాడు.

సూర్య నటించిన ‘సింగమ్‘ రీమేక్ గా అజయ్ దేవగణ్ ‘సింగమ్‘ తెరకెక్కింది. అయితే.. ‘సింగమ్ రిటర్న్స్‘ మాత్రం తన సొంత కథతోనే రూపొందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు కూడా ఓన్ స్టోరీతో ‘సింగమ్ అగైన్‘ మూవీని తీసుకొస్తున్నాడు. ఈ మూవీలో బాజీరావ్ సింగమ్ గా టైటిల్ రోల్ లో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో మరో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక పదుకొనె నటిస్తుంది.

లేటెస్ట్ గా వెల్కమ్ టు మై స్క్వాడ్ దీపిక పదుకొనె అంటూ ‘సింగమ్ అగైన్‘లోకి దీపికను ఆహ్వానిస్తూ సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టాడు అజయ్ దేవగణ్. ఈ పోస్ట్ లోని ఫోటోలలో దీపిక పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో శక్తి శెట్టి పాత్రలో దీపిక కనిపించబోతుంది. ఇక.. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్‘లో హీరోయిన్ గా నటించిన దీపిక.. ఆ తర్వాత ‘సర్కస్‘ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

Related Posts