మణిమేకలగా అదరగొడుతోన్న మాళవిక

అందంతో పాటు అభినయంలోనూ ఆకట్టుకునే భామలు అరుదుగా ఉంటారు. అలా.. ఒకవైపు గ్లామర్, మరోవైపు పెర్ఫామెన్స్ తో అదరగొట్టే మలయాళీ ముద్దుగమ్మ మాళవిక నాయర్. ఇప్పటివరకూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ లోనే ఎక్కువగా నటించిన మాళవిక.. ఫస్ట్ టైమ్ ఓ సీరియస్ రోల్ లో కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్ ‘డెవిల్‘లో మణిమేకల పాత్రలో పొలిటీషియన్ గా కనువిందు చేయబోతుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘డెవిల్‘. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రలో మాళవిక నాయర్ కనిపించబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మాళవిక పోషిస్తున్న మణిమేకల పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్.

అసలు ‘డెవిల్‘ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఏమైందో తెలీదు ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా అభిషేక్ నామా పేరే వేసుకున్నారు. నవీన్ మేడారం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అభిషేక్ నామా దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. నవంబర్ 24న పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ‘డెవిల్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts