సెప్టెంబర్ నెల తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ వీక్ తర్వాత సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 28 డేట్స్ చాలా కీలకం అనుకున్నారు. అందుకు భిన్నంగా సలార్ వాయిదా పడటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

ఏ సినిమా ఎందుకు వాయిదా పడుతుందో.. ఎందుకు రిలీజ్ డేట్స్ మారుతున్నాయో అర్థం కానంతగా మారిపోయాయి. ఈ గొడవలో ఎవరికి వారు హడావిడీ చేశారు తప్ప.. ఓ కీలకమైన డేట్ ను మాత్రం వదిలేశారు. అదే ఈ నెల 22. మరికొన్ని గంటల్లో ఫ్రైడే వస్తోంది.ఈ డేట్ లో పెద్ద సినిమాలేం లేవు. ఉన్న సినిమాలూ సందడి లేవు. అస్సలు ఈ వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయా అన్న సందిగ్దం కూడా ఉందంటే అతిశయోక్తి కాదు.

తెలుగు నుంచి అష్ట దిగ్బందనం, మట్టికథ అనే చిత్రాలతో పాటు కన్నడ హిట్ మూవీని డబ్ చేస్తూ సప్తసాగరాలు దాటి అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ డబ్బింగ్ సినిమాను అస్సలెవరూ పట్టించుకుంటున్నట్టు లేదు. ఇక తెలుగు సినిమాల సంగతి చూస్తే.. ఈ రెండిటిలోనూ పూర్తిగా కొత్తవారే ఉన్నారు. వాళ్లు క్రౌడ్ పుల్లర్స్ కాదు. కనీసం ప్రమోషన్స్ కూడా అగ్రెసివ్ గా లేవు. ఏవో మొక్కుబడిగా ఉన్నారు తప్ప నిజంగా తమ సినిమా విడుదలవుతుందన్న సీరియస్ నెస్ అస్సలు లేదు. మొత్తంగా తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నవారే కాదు.. ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నవాళ్లు కూడా పూర్తిగా 22ను వదిలేసినట్టు కనిపిస్తోంది.