లోకేష్‌ కనగరాజ్‌తో కమల్‌హాసన్‌ మ్యూజిక్ వీడియో

‘ఇనిమెల్‘తో లోకేష్ కనగరాజ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నారు ఉలగనాయగన్ కమల్ హాసన్. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ గతంలో ‘విక్రమ్’ అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించారు. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌ పై కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ సంయుక్తంగా ‘ఇనిమెల్’ మ్యూజిక్‌ వీడియోను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మ్యూజిక్ వీడియో ఇనిమెల్‌ను వెరీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ స్వరపరిచి, కాన్సెప్ట్ చేశారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు కనిపించనున్నారు. కమల్ హాసన్ ఇనిమెల్ కు లిరిక్ రైటర్ కూడా.
ఇనిమెల్ మ్యూజిక్ వీడియో త్వరలో విడుదల కానుంది.

Related Posts