కింగ్ ఆఫ్‌ కొత్తా.. అక్కడా అవుట్

మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్ ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తుంటాడు. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాలీవుడ్ మూవీస్ చేస్తూ అక్కడా అభిమానులను సంపాదించుకున్నాడు.

మంచి హ్యాండ్సమ్ నటుడే మాత్రమే కాక చాలా టాలెంటెడ్ కూడా కాబట్టి.. ఎక్కువమందికి తక్కువ టైమ్ లోనే నచ్చేశాడు. తెలుగులో మహానటి, సీతారామంతో మెప్పించిన దుల్కర్ తన మళయాల సినిమాలను తెలుగులోనూ డబ్ చేస్తున్నాడు. అంతకు ముందు పట్టించుకోలేదు. సీతారామం తర్వాత వస్తోంది కాబట్టి కింగ్ ఆఫ్ కొత్తాపై అంచనాలున్నాయి.

బట్ ఈ కింగ్ ఏ మాత్రం వాటిని రీచ్ కాలేకపోయాడు. తెలుగులో మొదటి ఆటకే పరమ బోరింగ్ అనేశారు. అవుట్ డేటెడ్ కంటెంట్ మాత్రమే కాదు.. అవుట్ డేటెడ్ డైరెక్షన్ కూడా అని తేల్చారు ఆడియన్స్. దీనికి తోడు ఓ రేంజ్ లో ల్యాగ్ ఉంది. దీంతో తెలుగులో రెండో ఆటకే థియేటర్స్ ఖాళీ అయ్యాయి.
కింగ్ ఆఫ్‌ కొత్త దుల్కర్ చేసిన ఫస్ట్ ఊరమాస్ మూవీ. దీంతో మళయాలంలో బాగా ఆకట్టుకుంటుందనుకున్నారు.

బట్ అక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్. మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ కింగ్ ను కాదనేశారు. అస్సలే మాత్రం కొత్త కంటెంట్ కాని ఈ చిత్రాన్ని దుల్కర్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు. ఇలా ల్యాగ్ ఉన్నా.. మాలీవుడ్ వారికి నచ్చుతుంది. బట్ ఈ మూవీ విషయంలో ఆ ల్యాగ్ వర్కవుట్ కాలేదు. విశేషం ఏంటంటే.. తమిళ్ లో కూడా పోయిందీ సినిమా. సో.. ఓవరాల్ గా కింగ్ ఆఫ్‌ కొత్తా .. విడుదలైన అన్ని చోట్లా చాలా పాత అని తేల్చారు ప్రేక్షకులు.

Related Posts