పెళ్లొద్దంటూ విజయ్ దేవరకొండ సూక్తులు

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. ఈ సారికంప్లీట్ వీడియో సాంగ్ నే విడుదల చేశారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు భిన్నంగా ఉందీ సాంగ్. అవన్నీ లవబుల్ మెలోడియస్ సాంగ్స్ లా అనిపిస్తే.. ఇది మాత్రం పెళ్లాం అంటే దెయ్యం అనేస్తూ అసలు పెళ్లే చేసుకోవద్దంటూ.. పెళ్లి తర్వాత వచ్చే సమస్యలన్నీ ఏకరువు పెడుతున్నట్టుగా ఉంది.

ఈ పాటను కూడా దర్శకుడు శివ నిర్వాణే రాశాడు. కథ తనదే కాబట్టి.. ఈ పాటకు అవసరమైన సాహిత్యం అతి సులువుగా వచ్చేసినట్టుంది. సింపుల్ వర్డ్స్ తోనే ఇంప్రెసివ్ గా రాశాడు. ఇక హేషమ్ సంగీతంలో మరోసారి స్పష్టంగా వినిపిస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ అర్థవంతంగా పాడారు.


“కాశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనను చూసినా.. ముందెనక చూడకుండా మనసిచ్చినా.. బాబు మాట పక్కనెట్టి బయటికొచ్చినా.. లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా.. స్ట్రగుల్ స్టార్ట్ ఆయెనే.. పాపం ఛేంజ్ ఆయనె.. ” ఓసి పెళ్లామా.. ఉన్న మాట ఇనుకోండ్రి.. పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి.. గన్ను కంటే పవర్ ఫుల్ ఆలం(ఆలి)డి.. దూల తీర్చేస్తదీ.. “అంటూ రాహుల్ సిప్లిగంజ్ గాత్రంతో మొదలైన పాట ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా భార్యల టార్చర్ ను చూసేవారికి ఇట్టే కనెక్ట్ అవుతుంది.


మరో విశేషం ఏంటంటే విజయ్ దేవరకొండ స్టెప్పులు బావున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి అయినా అతను డ్యాన్స్ వేసిన పాటలు కనిపించలేదు. బట్ ఈ పబ్ సాంగ్ లో మనోడు మంచి స్టెప్పులు వేశాడు. ఈ స్టెప్పులను రాజు సుందరం కొరియోగ్రఫీ చేశాడు.

Related Posts