యశ్‌ తో జోడీ కడుతున్న కియారా

కియారా అధ్వాని వరుస సినిమాలతో దూసుకుపోతుంది. లేటెస్ట్ సెన్సేషనల్ బజ్ ఉన్న మూవీ డాన్‌-3 లో చాన్స్ దక్కించుకున్న కియారా.. ఇప్పుడు యశ్ సరసన టాక్సిక్‌లోనూ నటించబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాత్రకు మొదట్లో యానిమల్ ఫేమ్‌ త్రిప్తి డిమ్రిని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కియారా ను ఆ పాత్ర వరించింది. ఈ సినిమా గీతామోహన్‌ దాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది.

కియారా సెలక్షన్ కంటే ముందు యశ్‌కు జోడీగా అనేక పేర్లు పరిశీలిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. త్రిప్తి డిమ్రితో పాటు కరీనా కపూర్ పేరు కూడా వినిపించింది. అయితే కియారా ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ కావడం జరిగింది. గోవా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ మాఫియా కథాంశంతో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ ప్యాక్డ్ ఫిల్మ్‌ టాక్సిక్‌. భారీ బడ్జెట్‌తో అడ్వాన్స్‌డ్ టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని వెంకట్‌ కే నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts