HomeMoviesటాలీవుడ్మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున మైనపు విగ్రహావిష్కరణ

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున మైనపు విగ్రహావిష్కరణ

-

అల్లు అర్జున్ క్రేజ్‌ పుష్పతో పీక్స్‌ కు చేరుకుంది. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ కావడమే కాదు.. జాతీయ అవార్డ్‌ సాధించిన మొట్ట మొదటి తెలుగు స్టార్ అయ్యాడు. అంతేకాదు.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించు గొప్ప అవకాశం కూడా బన్నీకి వచ్చింది. అతికొద్ది మంది స్టార్‌ హీరోలకే ఈ ఛాన్స్ దక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం బన్నీ మార్చి 28 న దుబాయ్‌ లో దర్శనమివ్వనున్నట్టు మ్యూజియం వర్గాలు ప్రకటించాయి.

మార్చి 28 న దుబాయ్ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంకు అల్లు అర్జున్ రానున్నారు.. బన్నీని కలిసే ఛాన్స్ గెలుచుకోండి అంటూ ప్రకటించింది మేడమ్‌ టుస్సాడ్స్‌ వర్గాలు. అల్లు అర్జున్‌ క్రేజ్ తగ్గేదేలే అంటూ పెరుగుతూనే ఉంది.

ఇవీ చదవండి

English News