ఖుషీ చేజారినట్టేనా

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతకు ముందు దర్శకుడితో పాటు విజయ్ దేవరకొండ, సమంత కూడా ఫ్లాపుల్లో ఉన్నారు. అయినా ఈ మూవీకి అనూహ్యమైన బిజినెస్ జరిగింది. పాటలు చార్ట్ బస్టర్ కావడంతో భారీ ఓపెనింగ్స్ తో సినిమా మొదలైంది. కానీ కంటెంట్ విషయంలో మిక్స్ డ్ టాక్ వినిపించింది. ఆల్రెడీ కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు, కథను రిఫరెన్స్ గా చూపుతూ ప్రేక్షకులు ఆశించినంత గొప్పగా లేదని తేల్చారు.

బట్ కాంబినేషన్ క్రేజ్, ప్రొడక్షన్ హౌస్ పై నమ్మకంతో కొత్త ప్రేక్షకులు ఓ సారి చూడొచ్చు అనుకుంటూ వెళ్లారు. ఫస్ట్ వీకెండ్ బానే ఉంది. కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. కాకపోతే నైజాం, ఓవర్శీస్ లలో బెటర్ అనిపించుకుందీ చిత్రం. మిగతా ఏరియాల్లో వీక్ డేస్ లో స్ట్రాంగ్ అవుతుందనుకున్నారు. సడెన్ గా వర్షాలు స్టార్ట్ కావడంతో ఖుషీకి సమస్య తప్పలేదు. చాలా చోట్ల థియేటర్స్ ఒక వంతు కూడా ఫుల్ కాలేదు.


ఇక ఈ వారం వచ్చిన సినిమాలు బాలేకపోతే మళ్లీ వీకెండ్ కు పుంజుకుంటుంది అని భావించారు.
కానీ ఈ వారం వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అబౌ యావరేజ్ అనిపించుకుంది. జవాన్ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది. ఇంకా చెబితే జవాన్ ముందు ఇప్పుడే సినిమా నిలవలేదు అనే చెప్పాలి. ఆ రేంజ్ లో టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో.. ఖుషీకి ఉన్న చివరి ఆశ కూడా పోయిందనే చెప్పాలి. ఈ వీకెండ్ కు ఖుషీని జనం పట్టించుకుంటారు అనలేం. దీంతో కలెక్షన్స్ పరంగా ఈ మూవీ కేవలం నైజాంలో మాత్రమే సేఫ్. మిగతా చోట్ల లాస్ గా డిక్లేర్ అయినట్టే అంటున్నారు.


మరోవైపు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని సంబరాలు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఏకంగా తన రెమ్యూనరేషన్ నుంచి కోటి రూపాయలు తీసి వందమందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పంచుతా అని ప్రకటించాడు. దీనిపై ఇతర నిర్మాతల నుంచి కొన్ని విమర్శలు వచ్చినా.. అందరూ విజయ్ నే సపోర్ట్ చేశారు. మొత్తంగా ఖుషీ ఈ వీకెండ్ కు కొంత ప్రాఫిట్స్ తెచ్చుకోవాలనుకుంటే జవాన్ తుఫాన్ లా వచ్చిన వీరికి ఖుషీ లేకుండా చేశాడు.

Related Posts