ఆసక్తి రేకెత్తిస్తోన్న విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్

‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత మళ్లీ దిల్‌రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను ఎంతో సరికొత్తగా డిజైన్ చేశాడట ఈ యంగ్ డైరెక్టర్. ఈరోజు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యింది.

‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..’ అనే డైలాగ్స్ తో విడుదలైన ఈ పోస్టర్ లో కత్తి చేతిపట్టుకున్న విజయ్ చేయి మాత్రమే కనిపిస్తుంది. పోస్టర్ అయితే చాలా ఇంప్రెస్సివ్ గా ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీకి దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. త్వరలోనే.. ఈ చిత్రానికి సంబంధించి మిగతా కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ తెలియనున్నాయి.

Related Posts