సందడి ఎక్కడ జవాన్

ఇవాళా రేపు చిన్న సినిమాలే పెద్ద ప్రమోషన్స్ తో వస్తున్నాయి. అలాంటిది ప్యాన్ ఇండియన్ సినిమా అంటే ఎలా ఉండాలి.. ఆ సౌండ్, రీ సౌండ్ కంట్రీ మొత్తం వినిపించాలంటే మూవీ టీమ్ అంతా ఎంత ప్రమోషన్స్ చేయాలి.

బట్ జవాన్ విషయంలో అలాంటిదేం కనిపించడం లేదు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకోణ్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తమిళ్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ కే దేశవ్యాప్తంగా తిరుగులేని అప్లాజ్ వచ్చింది. పఠాన్ తర్వాత షారుఖ్ నుంచి మరో అవుట్ స్టాండింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందని ప్రేక్షకులంతా ఫిక్స్ అయ్యారు.

అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ట్రైలర్ లోనే నెక్ట్స్ లెవల్ అనిపించేసుకుంది. దీంతో సినిమపై ఒక్కసారిగా భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే సెప్టెంబర్ 7న విడుదల కాబోతోన్న మూవీ టీమ్ నుంచి ప్రమోషనల్ గా ఎలాంటి సందడి కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ వరకూ ఓకే కానీ.. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో మిగతా ఆడియన్స్ కు ఈ మూవీ గురించి పూర్తిగా తెలియకుండా పోతోందని షారుఖ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


హీరోయిన్ గా నటించిన నయనతార కొన్నాళ్ల క్రితమే ప్రమోషన్స్ కు రాను అని ఖరాకండీగా చెప్పేసింది. పఠాన్ నుంచి షారుఖ్ ఖాన్ కూడా ఆ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అంత పెద్ద హీరో వస్తున్నాడు కాబట్టి హీరోయిన్ కూడా రావాలి అని బాలీవుడ్ నుంచి ఏదైనా ఒత్తిడి వస్తుందనుకున్న నయన్ కు పెద్ద రిలీఫ్ వచ్చింది. అయినా కనీసంగా ఒక ఈవెంట్ అయినా చేయాలి కదా అనే వాదనలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు పెద్ద సినిమాలకు సంబంధించి అన్ని పరిశ్రమలకూ తిరగడం లేదు. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ఏదో ఒక నగరాన్ని ఎంచుకుని మిగతా భాషల మీడియానే అక్కడకు రప్పిస్తున్నారు. తద్వారా అన్ని భాషల్లోనూ ఆ కంటెంట్ వెళుతుంది. బట్ ఈ మూవీకి సంబంధించి అలాంటి ప్లాన్ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎంత బలమైన కంటెంట్ ఉన్నా.. కనీసం ప్రమోషన్స్ లేకపోతే బలైపోయేది నిర్మాతలే కదా.. అన్నట్టు.. ఇది షారుఖ్ సొంత బ్యానర్లోనే వస్తోంది. సో.. అతనికే ప్రాబ్లమ్ లేనప్పుడు మాకెందుకు అని మిగతా వారు అనుకుంటే కూడా తప్పేం లేదేమో..

Related Posts