ఓవర్శీస్ లో ఖుషీ.. ఖుషీగా

విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత పెద్ద హిట్ పడింది. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరున్నా.. సరైనహిట్స్ లేకపోతే అంతే సంగతులు అనేది అందరికీ తెలుసు. ఆ విషయంలో విజయ్ గీత గోవిందం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు పడ్డాయి. ముఖ్యంగా లైగర్ రిజల్ట్ తో అభాసుపాలయ్యాడు కూడా.

అయితే ఒక్క హిట్ వీటిని మార్చేస్తుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఫైనల్ గా ఆ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. సమంతతో కలిసి నటించిన రొమాంటిక్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

ముఖ్యంగా ఓవర్శీస్ లో అప్పుడే ఒన్ మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాగ్జిమం సేఫ్ వెంచర్ అనిపించుకున్న ఖుషీ రెండున్న రోజుల్లోనే ఒన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవడం అంటే అక్కడి ఆడియన్స్ కు ఈ చిత్రం ఎంత బాగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.


శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ముందు నుంచీ ఖుషీకి బ్యాక్ బోన్ గా నిలిచింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. పాటలతో మొదలుపెట్టిన ఖుషీ విజయ యాత్ర సినిమాతో కొనసాగుతోంది. విశేషం ఏంటంటే.. ఈ యేడాది ఓవర్శీస్ లో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య నెలకొల్పిన రికార్డ్ ను కూడా దాటేసింది ఖుషీ.


శుక్రవారం రోజు వాల్తేర్ వీరయ్య 3లక్షల డాలర్లతో 2023లో టాప్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. అదే రోజు 3.50 లక్షల డాలర్లు వసూలు చేసి ఖుషీ వాల్తేర్ వీరయ్యను దాటేసింది. అఫ్ కోర్స్ ఖుషీకి ఇప్పుడు ఏ పోటీ లేదు.

అటు హాలీవుడ్ నుంచి టాప్ మూవీస్ ఏం లేవు. అందుకే వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. అదీ కాక యూత్ ఫుల్ కంటెంట్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కూ నచ్చేలా ఉండటంతో ఖుషీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్శీస్ లో కూడా కలెక్షన్స్ పరంగా ఖుషీ ఖుషీగా ఉంది.

Related Posts