నేడే ప్రారంభం.. బిగ్ బాస్ 7వ సీజన్

బిగ్ బాస్.. బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ షో రన్ అవుతోంది. ఇండియాకీ ఎప్పుడో ఎంటర్ అయింది. అక్కడి నుంచి మెల్లగా అన్ని ప్రాంతీయ భాషల్లోకీ వచ్చింది. అలా తెలుగులో ఫస్ట్ సీజన్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రారంభించారు.

ఎన్టీఆర్ నటుడుగానే కాదు.. హోస్ట్ గానూ అదరగొట్టాడు. ఇప్పటి వరకూ 6 సీజన్స్ ముగిశాయి. సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేశాడు. కానీ తేలిపోయాడు. ఆ తర్వాత నాగార్జున కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయనే ఈ ఏడో సీజన్ ను హోస్ట్ చేయబోతున్నాడు.

కొన్నాళ్ల క్రితమే హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్ లిస్ట్ పూర్తయింది. ఇక ఇవాళ్టి నుంచి స్టార్ మా లో బిగ్ బాస్ షో స్టార్ట్ కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి సంబరం స్టార్ట్ కాబోతోంది. స్టార్ మా లో ప్రతి రోజు రాత్రి 9.30 గంటలక ఈ షో ప్రసారం అవుతుంది. అలాగే కంప్లీట్ గా చూడాలనుకునేవాళ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు. ఆ ప్లాట్ ఫామ్ లో రోజంతా స్ట్రీమ్ అవుతుందీ షో.


ఇక గత రెండు సీజన్స్ అనుకున్నంత గొప్పగా రాలేదు. ముఖ్యంగా 6వ సీజన్ పేలవంగా ఉంది. అస్సలే మాత్రం రేటింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అది నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద రియాలిటీ షో ఎలా ఉన్నా చూస్తారు అనుకున్న వారి అంచనాలపై దెబ్బ కొట్టింది. అందుకే ఈ సారి మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారట. కంటెస్టెంట్స్ కూడా ఊహించని వాళ్లు వస్తారు అంటున్నారు.

అలాగే ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండవు అని ముందే చెప్పారు. అటు నాగార్జున కూడా ఈ సారి మామూలుగా ఉండదు అంటూ హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. మరి ఈ షో ఈ సారి ఎలా ఉంటుందో కానీ హౌస్ లోకి వస్తోన్న కంటెంస్టెంట్స్ ఎవరు అనేది సాయంత్రం పూర్తిగా తెలిసిపోతుంది.


ఇప్పటి వరకూ మాజీ హీరో శివాజీ, షకీలా, అమర్ దీప్ చౌదరి, అర్జున్ అంబటి, ఆట సందీప్, ఈటీవి ప్రభాకర్, శోభాశెట్టి, అశోకవనంలో అర్జున కళ్యాణం హీరోయిన్ రితికా నాయక్, మాజీ హీరోయిన్ ఫర్జానా, సీరియల్ నటి ప్రియాంక జైన్, సింగర్ దామిని భట్ల, న్యూస్ ప్రెజెంటర్ ప్రత్యూష, యాంకర్ నిఖిల్, ఫూడ్ వ్లాగర్ టేస్టీ తేజ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంతమంది హౌస్ లోకి వెళుతున్నారు అనే క్లియర్ పిక్చర్ సాయంత్ర 7 గంటల తర్వాత తెలుస్తుంది.

Related Posts