దివాళి బరిలో కార్తీ ‘జపాన్‘

హీరో కార్తీ ఏ సినిమా చేసినా అందులో ఏదో ఓ కొత్తదనం ఉంటుంది. ‘సర్దార్, పొన్నియిన్ సెల్వన్‘ చిత్రాల తర్వాత ఇప్పుడు ‘జపాన్‘ అంటూ మరో వైవిధ్యభరిత చిత్రంతో సిద్ధమయ్యాడు కార్తీ. ఈ సినిమాలో జపాన్ పాత్రలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నటించాడు. ఆమధ్య గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న ‘జపాన్‘ నుంచి లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.

‘నాలుగు రాష్ట్రాల పోలీసులు వాడికోసం వెతుకుతున్నారు.. కానీ.. ఒక్కసారి కూడా వాడు ఎవడికీ దొరకలేదు..‘ అనే డైలాగ్స్ వింటేనే ఈ మూవీలో కార్తీ పోషించే దొంగ పాత్ర ఏ రీతిన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో జపాన్ గా కార్తీ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఇంకా.. మన తెలుగు నటుడు సునీల్ ఈమధ్య వరుసగా తమిళ చిత్రాల్లో అదరగొడుతున్నాడు. తెలుగులో ఒకే తరహా మేకోవర్ కి పరిమితమైన సునీల్ కి.. తమిళ దర్శకులు మాత్రం కొత్త తరహా పాత్రలు ఇస్తున్నారు. కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించింది.

రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. మొత్తంమీద.. టీజర్ తో మెప్పించిన ‘జపాన్‘ దివాళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts