భగవంత్ కేసరి కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్

దసరా కానుకగా నేడు థియేటర్లలోకి దిగిన భగవంత్ కేసరి కి అంతటా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ముఖ్యంగా ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ తర్వాత బాలయ్య ‘భగవంత్ కేసరి‘తో హ్యాట్రిక్ కొట్టాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గత కొన్ని సినిమాలుగా తన మేకోవర్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాలోనూ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించాడు. అందులో ఒకటి యంగ్ లుక్ అయితే.. మరొకటి ఓల్డ్ లుక్. ఈ రెండు లుక్స్ కి సంబంధించిన మేకోవర్స్ లో ఓల్డ్ లుక్ మేకోవర్ చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. ఇక.. యంగ్ లుక్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య ఆహార్యంతో పాటు సినిమాలో ఆయన షటిల్డ్ పెర్ఫామెన్స్, డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యు.ఎస్. లో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను ‘ఎక్స్‘ ద్వారా వెల్లడి చేస్తున్నారు.

ఈమధ్య ‘విక్రమ్, జైలర్‘ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈకోవలోనే ఈ సినిమాలోని బాలయ్య ఎలివేషన్స్ కూడా అదుర్స్ అనిపించేలా ఉన్నాయని.. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఎక్కువమంది ‘భగవంత్ కేసరి‘ గురించి పాజిటివ్ గా స్పందిస్తుండగా.. కొంతమంది మాత్రం సినిమా ల్యాగ్ ఉందంటూ నెగటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే అనిల్ రావిపూడి గత చిత్రాల్లోలా కామెడీ అంతగా వర్కవుట్ కాలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.

Related Posts