టాలీవుడ్

కళ్యాణ్‌రామ్ ‘బింబిసార’ ప్రీక్వెల్ అనౌన్స్‌మెంట్

డెబ్యూ డైరెక్టర్స్ తో వండర్స్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కళ్యాణ్ రామ్ విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. అయితే.. కళ్యాణ్ రామ్ ద్వారా దర్శకులుగా పరిచయమైన వాళ్లు.. మళ్లీ కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేయడానికి మాత్రం అందుబాటులో ఉండడం లేదు. లేటెస్ట్ గా ‘బింబిసార 2’ విషయంలో ఇదే జరుగుతుంది.

సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి ల తర్వాత కళ్యాణ్ రామ్ కాంపౌండ్ నుంచి వచ్చిన మరో దర్శకుడు మల్లిడి వశిష్ట. కళ్యాణ్ రామ్ తో వశిష్ట చేసిన ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో.. గతానికి వర్తమానంతో లింక్ పెడుతూ రూపొందిన ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించిన వెంటనే ‘బింబిసార 2’ ఉంటుందని ప్రకటించాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్.

లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్ గా ‘బింబిసార 2’ అనౌన్స్ అయ్యింది. అయితే.. ఈ చిత్రం ‘బింబిసార’కి సీక్వెల్ కాదు ప్రీక్వెల్. ఈసారి వశిష్ట బదులు దర్శకుడిగా అనిల్ పాడూరి ఎంపికయ్యాడు. పూరి జగన్నాథ్ శిష్యుడైన అనిల్ పాడూరి ‘రొమాంటిక్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి కళ్యాణ్ రామ్ 22వ చిత్రంగా ‘బింబిసార’ ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ఆద్యంతం త్రిగర్తల సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందే ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది.

Telugu 70mm

Recent Posts

సంచలనం సృష్టించిన సాయిధరమ్ పోస్ట్

సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. సరదా పేరుతో కొంతమంది యూట్యూబర్లు పిల్లలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి ఓ…

4 mins ago

తన వాయిస్ తో బుజ్జికి ప్రాణం పోసిన కీర్తి

'కల్కి 2898 AD'లో బుజ్జి వెహికల్ కూడా ఒక పాత్రే. వెండితెరపై బుజ్జి కి తన వాయిస్ తో ప్రాణం…

10 mins ago

తెలుగు వారితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్

జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ కి తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. హీరో కాక ముందే…

14 mins ago

ఆ విషయంలో కమల్ కి శంకర్ కండిషన్స్

విశ్వ నటుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం 'భారతీయుడు 2'. 1996లో వచ్చిన 'భారతీయుడు'కి…

27 mins ago

‘గేమ్ ఛేంజర్’ గురించి ఫ్యాన్స్ కు గ్రేట్ న్యూస్

'భారతీయుడు 2' విడుదలకు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటివరకూ తమిళనాడు, హిందీ ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించిన…

34 mins ago

ప్రభాస్ కి ప్రతినాయకుడిగా కొరియన్ యాక్టర్

ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…

19 hours ago