టాలీవుడ్

బాలయ్య ను లైట్ తీసుకున్న జూనియర్

జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడుగా తెలుగు తెరపై అడుగుపెట్టాడు. తనదైన ప్రతిభతో టాప్ స్టార్ గా ఎదిగాడు. అతను స్టార్ అయిన తర్వాత కుటుంబం కలుపుకుంది. బాలకృష్ణ కూడా అండగా నిలిచాడు. అతని అభిమానులూ ఎన్టీఆర్ ను సపోర్ట్ చేశారు. అయితే కొన్నాళ్లుగా ఈ కుటుంబంలో విభేదాలు పెరిగాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య దూరం బాగా పెరిగింది. ఆ విషయం పెద్దాయన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి సభల్లో స్పష్టమైంది.

ఇందుకు రాజకీయ కారణాలు కూడా చూపిస్తున్నారు చాలామంది. ఏది ఎలా ఉన్నా.. ఎప్పుడూ బాలా బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించే జూనియర్.. బాలయ్య బర్త్ డే రోజు కనీసం విషెస్ కూడా చెప్పకపోవడం గమనార్హం. అంతకు ముందు ఇలాంటి గొడవలు ఉన్నా.. బర్త్ డే విషెస్ మాత్రం చెప్పేవాడు. బట్ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సభల్లో తనను కావాలనే బ్యాడ్ చేశారు అనుకున్నాడో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం పూడ్చలేనంత అగాధం పెరిగింది ఆయన బర్త్ డే సందర్భంగా పూర్తిగా అందరికీ స్పష్టమైంది. ఇప్పటి వరకూ తమ్ముడి అడుగుజాడల్లో నడుస్తూ.. తనూ పెద్దాయన సభలకు వెళ్లని కళ్యాణ్ రామ్ మాత్రం బాబాయ్ కి విషెస్ చెప్పడం ఆలోచించాల్సిన అంశం.


ఇక ఇప్పటి వరకూ జూనియర్ వస్తేనే తెలుగు దేశం పార్టీ బాగుపడుతుందని.. అప్పుడే మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీలో ఒక వర్గం బలంగా నమ్ముతూ వస్తోంది. కానీ అతని వ్యవహార శైలి చూస్తోంటే తెలుగు దేశం పార్టీని తను పూర్తిగా వదిలేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వైసీపీకి దగ్గరగా ఉంటున్నాడు అనే వాదనలకు కూడా ఈ సంఘటనలు బలాన్నిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా.. ఎన్టీఆర్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండటానికి ప్రధాన కారణం తెలుగు దేశం పార్టీ అనేది కాదనలేని సత్యం. ఆ పార్టీయే అతన్ని పెద్దాయన మనవడుగా దగ్గర చేసుకుంది. సినిమాలకు కటౌట్లు కట్టింది.

కటౌట్లకు పాలాభిషేకాలు చేసింది తెలుగుదేశం శ్రేణులే. ఆ తర్వాతే అతనికి కొంత సొంత ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. ఈ కొత్త బేస్ ను చూసుకుని పునాదిని మర్చిపోతున్నాడు అనేది నిజం అంటున్నారు మొదట్నుంచీ ఎన్టీఆర్ ను చూస్తున్నవారు. కనీసం ఒక బర్త్ డే విషెస్ చెప్పడానికి కూడా మనసు రాని వాడు రేపు పార్టీ కోసం నిలబడతాడు అంటే ఎలా నమ్ముతాం అంటూ ఇప్పుడు కొత్తగా వచ్చిన అభిమానులు కూడా అనుకుంటున్నారు.


నిజానికి చాలాకాలం నుంచే అతను వైసీపికి అనుకూలంగా ఉంటున్నాడు అనే మాటలు వచ్చాయి. అందుకు కారణం అతని స్నేహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీళ్లు ఫీల్ అవుతారనే ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలకు విజయవాడ వెళ్లలేదు. అలాగే గుడివాడ, నిమ్మకూరు అభివృద్ధి విషయంలో నాని .. చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై స్పందించలేదు. అంతెందుకు చంద్రబాబు భార్యను అనుచితంగా మాట్లాడిన వంశీపై ఈగ వాలకుండా చూసుకున్నాడు.

అతని విమర్శ కూడా పసలేనిదిగా కనిపించింది. ఇవన్నీ అతను కేవలం నందమూరి కుటుంబానికే కాదు.. మొత్తం తెలుగు దేశం పార్టీకి కూడా పూర్తిగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోన్న సంకేతాలుగా విశ్లేషకులు అప్పుడే భావించారు. ఇప్పుడు అవే నిజం రోజు రోజుకూ తేలిపోతుంది. ఇప్పటి వరకూ ఏదో ఒక రోజు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కోసం నిలబడతాడు.. వస్తాడు అనుకున్న వారి మబ్బులు కూడా తొలగిపోతున్నాయి. ఇక తాజా సంఘటనతో ఎన్టీఆర్ ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బహుదూరపు బాటసారి అయినట్టే అనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

11 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

12 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

12 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

12 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

17 hours ago