జూన్ లాస్ట్ వీక్ మూవీస్ లిస్ట్ పెద్దదే

జూన్ మంత్ ఎండింగ్ కు వచ్చేశాం. సమ్మర్ దారుణంగా నిరాశపరిచిన తర్వాత జూన్ అయినా కాస్త ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నారు. బట్ ఈ నెల కూడా ఏమంత గొప్పగా లేదు. ఇక నెలాఖరుకు వచ్చాం. అయితే చాలామంది 29నే రెండు సినిమాలున్నాయి అనుకుంటున్నారు. ఆ రెండిటిపైనే ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ దృష్టి కూడా ఉంది. బట్ ఆ తర్వాతి రోజు శుక్రవారం మరో మూడు సినిమాలున్నాయన్న సంగతి మర్చిపోతున్నారు. 29న వచ్చే సినిమాలపై బజ్ ఉంది. అంచనాలూ పెంచుతున్నారు. అందుకే అందరి అటెన్షన్ ఆ రెండు సినిమాలపైనే ఉంది.

వీటిలో ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమా నిఖిల్ స్పై. గ్యారీ హెచ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చాలా అంశాలే టచ్ చేశాం అని చెబుతున్నారు. ముఖ్యంగా సుభాష్‌ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేదించే పని సినిమాతో పెట్టుకున్నాడు నిఖిల్. కార్తికేయ2 తర్వాత ఈ మూవీతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. రీసెంట్ గా ముంబైలో ప్రమోషన్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 29న వవస్తోంది.


స్పైతో పాటు వస్తోన్న మరో సినిమా సామజవరగమన. శ్రీ విష్ణు, రెబా జాన్ జంటగా నటించారు. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో ఇది కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ అయితే ఇది కామెడీ ఎంటర్టైనర్. సో ఈ రెండు డిఫరెంట్ జానర్స్ కు తగ్గ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు అనుకోవచ్చు. ఇక ఈ చిత్రాలే ఉన్నాయి కాబట్టి నిఖిల్ కు కలిసొస్తుంది అనుకున్నారు.

బట్ నెక్ట్స్ మే మాయా పేటిక, నారాయణ అండ్ కో, లవ్ యూ రామ్ అనే చిత్రాలున్నాయి. వీటిలో మాయా పేటిక, నారాయణ అండ్ కో ట్రైలర్స్ బావున్నాయి. బట్ ప్రమోషన్స్ సరిగా లేవు. లవ్ యూ రామ్ బొత్తిగా కొత్తవాళ్లు. కనీసం తెలిసిన మొహాలు కూడా కాదు. అందుకే వీరి ప్రమోషన్స్ కూడా పెద్దగా మెప్పించడం లేదు. సో.. మొత్తంగా ఈ వీక్ ఐదు సినిమాలున్నాయి. రెండు గురువారం, మూడు శుక్రవారం విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఆడియన్స్ ఎక్కువగా ఏ చిత్రానికి జై కొడతారో చూడాలి.

Related Posts