స్పై బ్యూటీకి క్రేజీ ఆఫర్

మామూలుగా ఏ హీరోయిన్ అయినా ఒక భాషలో డెబ్యూ చేస్తుంటే ముందు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త ఆఫర్స్ వస్తాయి. కానీ స్పై బ్యూటీకి ఈ మూవీ రిలీజ్ కు ముందే మరో క్రేజీ ఆఫర్ వచ్చేసింది. ఇలా అప్పుడప్పుడూ మాత్రమే జరుగుతుంది. మళయాలంలో పదేళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టిన ఐశ్వర్య మీనన్..

ఇన్నాళ్లకు తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. చూడ్డానికి చాలా అందంగా ఉండే ఐశ్వర్యకు ఇంత ఆలస్యంగా టాలీవుడ్ నుంచి పిలుపు వెళ్లడం ఆశ్చర్యమే అయినా.. స్పై ట్రైలర్ తో పాటు తన పాట చూస్తే ఐశ్వర్యకు ఇది డ్రీమ్ డెబ్యూ అయ్యేలా ఉందని చెప్పాలి. నిజానికి కొన్నాళ్ల క్రితమే తను మాస్ రాజా రవితేజ సినిమాలో నటించాల్సి ఉంది. ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. బట్ లేట్ అయినా స్పై తో టాలీవుడ్ ను స్పైసీగా ఊరించడానికి వస్తోంది.


ఇక ఈ 29న విడుదల కాబోతోన్న స్పై తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయింది. ఆర్ఎక్స్ 100 స్టార్ కార్తికేయ సరసన నటించబతోంది. ఇది యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతోన్న చిత్రం కావడం విశేషం. పెద్ద హీరో కాకపోయినా పెద్ద బ్యానర్ లో పడితే తన కెరీర్ కు ప్లస్ అవుతుంది.

అలాగని కార్తికేయను తక్కువ చేయడం కాదు. బట్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. అతని కొత్త సినిమా బెదురులంక 2012 విడుదలకు సిద్ధంగా ఉందిప్పుడు. ఇది రిలీజ్ అయితే తనకు పెద్ద విజయం వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ.


ఏదేమైనా ఫస్ట్ మూవీ రిలీజ్ కు ముందే నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్ చేయడం ద్వారా ఐశ్వర్య మీనన్ తెలుగులో పాగా వేయబోతోందనేది అర్థం అవుతోంది. స్పై నిజంగానే బ్లాక్ బస్టర్ అయితే అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వస్తాయనడంలో డౌటే లేదు. అసలే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది.

Related Posts