జవాన్.. హై ఓల్టేజ్ ట్రైలర్..

పఠాన్ తో అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఎప్పటికీ బాలీవుడ్ బాద్ షా అంటే తనే అని ప్రూవ్ చేసుకున్నాడు షారుఖ్ ఖాన్. పఠాన్ లాంటి విజయం కోసం పదేళ్లకు పైగా వెయిట్ చేశాడు అతను. ఫైనల్ గా ఆ మూవీతో బాలీవుడ్ కు కూడా కొత్త ఊపిరి పోశాడు. ఇక ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ అట్లీతో జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు.

నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో దిపికా పదుకోణ్‌ ఓ గెస్ట్ అప్పీరియన్స్ చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ జవాన్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పఠాన్ తర్వాత అదే రేంజ్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ ఆరంభం నుంచి ఆఖరు వరకూ యాక్షన్ డోస్ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. అట్లీ నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేదు అనే చెప్పాలి. అతను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక లెక్క.. ఈ సినిమా ఒక లెక్క అనేలా ఈ ట్రైలర్ కే తేలిపోతోంది.


” ఎవరు నేను.. ఎవరినీ కాను.. తెలియదు. తల్లికి ఇచ్చిన మాట కావొచ్చు. నెరవేరని లక్ష్యం కావొచ్చు. నేను మంచి వాడ్నా.. చెడ్డవాడ్నా.. పుణ్యాత్ముడినా.. పాపాత్ముడునా.. నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే.. నేనే నువ్వు.. ” అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో కింగ్ ఖాన్ ప్రెజెన్స్ అద్దిరిపోయింది. నయనతార పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

విశేషం ఏంటంటే.. ఇందులో ఓ లేడీ గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ కు ప్రియమణి లీడర్ లా కనిపిస్తోంది. అమ్మాయిలంతా యాక్షన్ సీక్వెన్స్ లో కీలకంగా ఉన్నారు. ఇక చివర్లో షారుఖ్ చెప్పిన.. ” నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు..” అనే డైలాగ్ తో పాటు ట్రైన్ లో కనిపించిన పాట అట్లీ బ్రిలియన్సీని చూపిస్తుంది.


ఇక ఈ ట్రైలర్ గురించి ప్రత్యేకంగాచెప్పుకోవాల్సింది.. విజువల్స్ అండ్ మేకింగ్. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 7న ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతోన్న జవాన్ దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయబోతోందని మాత్రం అర్థం అవుతుంది.

Related Posts