లవర్ తో తిరుపతిలో జాన్వీ కపూర్

బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే సౌత్ సినిమా ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ జాన్వీ కపూర్ కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ చేసింది.

స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లే చిత్రీకరిస్తున్నారు. ఇంకా టాకీ, పాటలు మొదలు కాలేదు. అందుకే అమ్మడు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్ లో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా తను తిరుమల శ్రీవారిని సందర్శించుకుంది. మామూలుగా జాన్వీ కపూర్ కు భక్తి ఎక్కువే. ఇప్పటికే చాలాసార్లు తిరుపతి దర్శనానికి వచ్చింది. అయితే ఈ సారి సోలోగా రాలేదు. అందరికీ దొరికిపోయేలా ప్రియుడితో కలిసి వచ్చింది.


కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో శిఖర్ పహారియా అనే కుర్రాడితో ప్రేమలో ఉంది అనే టాక్స్ ఉన్నాయి. ముంబైలో ఈ ఇద్దరూ కలిసి మీడియాకు కనిపించారు. బట్ తమ మధ్య ఏదో ఉందన్న విషయాలను మాత్రం కొట్టి పడేశారు.

బట్ ఇవాళ తిరుపతికి కూడా ఆ కుర్రాడితోనే కలిసి వచ్చింది. అసలే లవ్ బర్డ్స్ అనే రూమర్స్ ఉన్న టైమ్ లో ఇలా పబ్లిక్ గా బయటకు వస్తే ఆ రూమర్స్ కు ఇంకా బలం పెరుగుతుంది కదా.. అయితే తిరుపతి లాంటి ప్రదేశంలో తమను ఎవరూ గుర్తించరు అనుకుందేమో. కానీ కొన్ని విషయాలను ఎంత దాచాలనుకున్నా దాగవు అంటారు కదా.. అలా అమ్మడు కూడా ఇలా దొరికిపోయింది.

Related Posts