రామ్ చరణ్‌.. గురువుతో గోదారి.. శిష్యుడుతో శ్రీకాకుళం

మెగాస్టార్ వారసుడుగా వచ్చినా తనదైన రూట్ లో తనకంటూ రెండో సినిమాకే తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్‌. మినిమం టైమ్ లోనే మాస్ హీరోగా మారాడు. టాప్ హీరోల లిస్ట్ లోకీ చేరాడు. బట్ ఎక్కడో చిన్న నిరాశ. నటన పరంగా రామ్ చరణ్ లోని ది బెస్ట్ ను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కూడా ఎదురుచూసిన కాలం ఉంది. అటు అవతలి హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేసింది కూడా ఈ విషయంలోనే. డ్యాన్స్, ఫైట్స్ లో సూపర్ అనిపించుకున్నా.. నటనలో కూడా అలా ఎప్పుడా అనుకున్నవారికి ఆన్సర్ రంగస్థలంతో దొరికింది.

ఈ సినిమాలో అతని నటన చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. అసలెవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. పైగా చెవులు సరిగా వినిపించని కుర్రాడి పాత్ర. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ ఎంటర్టైనర్. రంగస్థలంలో సిట్టిబాబుగా అతని నటనకు ఫిదా కాని వారే లేరంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో మెప్పించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ గోదావరి యాసలో డైలాగులు చెప్పాడు. గోదావరి యాస ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి పెద్ద కష్టమై ఉండదు. అయినా పాత్రగా డైలాగ్స్ చెప్పడం టఫ్ అనే చెప్పాలి. ఆ విషయంలోనూ బెస్ట్ అనిపించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ శిష్యుడి సినిమాలో శ్రీకాకుళం యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు.


సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తర్వాతి సినిమా చేయబోతున్నాడు చరణ్‌. ఫిషర్ మెన్ నుంచి స్పోర్ట్స్ మేన్ గా ఎదిగే ఓ కుర్రాడి కథ ఇది. మాస్ తో పాటు క్లాస్ ను కూడా అలరించే అన్ని అంశాలూ ఉంటాయని చెబుతున్నాడు బుచ్చిబాబు. ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందట. అందుకే రామ్ చరణ్ కూడా ఆ యాసలోనే డైలాగులు చెప్పబోతున్నాడట.

తెలుగు యాసల్లో ఉత్తరాంధ్ర మాండలికపు సొగసు వైవిధ్యంగా ఉంటుంది. కొన్ని పదాలు ఇతర ప్రాంతాల వారు అంత త్వరగా క్యాచ్ చేయలేరు. పలికే విధానం కూడా �