HomeMoviesటాలీవుడ్కింగ్ వస్తున్నాడు..

కింగ్ వస్తున్నాడు..

-

కింగ్ నాగార్జున బౌన్స్ బ్యాక్ కోసం చూస్తున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తనకు తోడు.. కొడుకులు కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నారు. దీంతో ఆయనపై ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కెరీర్ లో 99వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేసుకుని 100వ సినిమా చేయాలనేది ఆయన ఆలోచన. 100వ సినిమా కోసం ఆల్రెడీ దర్శకుడు మోహన రాజాను సిద్ధం చేసుకున్నాడు. 99వ మూవీ కోసమే కొన్నాళ్లుగా నానా తంటాలు పడుతున్నాడు. ఫైనల్ గా ఆ తంటాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. మళయాల హిట్ మూవీ ‘పోరింజు మరియం జోస్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కొరియోగ్రాఫర్ లారెన్స్ ఏ రేంజ్ లో ఉన్నాడో అందరికీ తెలుసు.అలా విజయ్ బిన్నీ రేంజ్ కూడా మారేలా హిట్ కొడితే అది నాగార్జునకే ప్లస్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.


ఇక ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను ఆయన బర్త్ డే రోజు మంగళవారం ఉదయం 10. 47 గంటలకు గ్లింప్స్ ద్వారా ఇవ్వబోతున్నారు.

ఈ గ్లింప్స్ లోనే మూవీ సంక్రాంతి రిలీజ్ అనే డైలాగ్ ను కూడా చెప్పిస్తారట. సో.. కింగ్ అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ డేట్ తో పాటు వచ్చేస్తున్నాడన్నమాట.

ఇవీ చదవండి

English News