జజ్జనకా భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. తమిళ్ లో రూపొందిన వేదాళం చిత్రానికి రీమేక్ ఇది. వేదాళం అదే పేరుతో తెలుగులోనూ డబ్ అయింది. అయినా మెగా ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో చాలా మార్పులు చేశాం అని చెప్పారు. చాలాకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న మెహర్ రమేష్‌ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.

చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటించగా.. చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అంతకు ముందే రిలీజ్ అయిన పాట కూడా ఆకట్టుకుంది. లేటెస్ట్ గా కాసర్ల శ్యామ్ రాసిన జామ్ జామ్ జజ్జనకా అంటూ మరో పాట విడుదల చేశారు.


పాట ప్రోమో విన్నప్పుడే చాలా వరకూ తెలంగాణ ఫ్లేవర్ కనిపించింది. ఆ ఫ్లేవర్ అయితే ఉంది కానీ.. పాట అంత గొప్పగా కుదరలేదు అనే చెప్పాలి. ట్యూన్ లోపమా లేక రొటీన్ గా ఉన్న సాహిత్యం కారణమా అనేది చెప్పలేం. బట్ చాలా సాధారణమైన సాంగ్ లానే ఉంది. కాకపోతే సినిమాలో ఇదో పార్టీ సాంగ్ లా ఉంది.

అందుకే మెగాస్టార్ తో పాటు సినిమాలోని అతని ఫ్యామిలీ మొత్తం ఈ పాటలో కనిపిస్తోంది. పాట మధ్యలో మెగాస్టార్ బీట్ మార్చమని చెప్పడం.. తర్వాత ఇప్పటికే ఎన్నోసార్లు యూ ట్యూబ్ లో విన్న ‘నర్సపెల్లే గండిలోన గంగధారి’ అనే పాట రావడం అస్సలు బాలేదు. మెగాస్టార్ రేంజ్ కు ఇలా యూ ట్యూబ్ సాంగ్ కు పరిమితం చేయడం నప్పలేదు అనే చెప్పాలి. కావాలనుకుంటే కాసర్ల శ్యామ్ నుంచి మరో కొత్త బిట్ రాయించుకుని ఉండాల్సింది. అంతే తప్ప అరిగిపోయిన పాటను చిరంజీవికి వాడటం బాలేదు.


ఇక మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాట ట్యూనింగ్ కూడా ఆకట్టుకునేలా లేదు. అత్యంత సాధారణమైన ట్యూన్ గానూ, అస్సలే మాత్రం ఆకట్టుకోని ఆర్కెస్ట్రైజేషన్ కనిపిస్తోంది. మొత్తంగా భోళా శంకర్ నుంచి వచ్చిన రెండో పాట కూడా సాధారణంగానే ఉందనిపించుకుంటోంది. ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న ఈ మూవీ థియేటర్స్ లో ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

Related Posts