మహా వీరుడు ఇంత వీకా..

తెలుగులో పాగా వేయాలని తమిళ్ హీరోలంతా కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. వరుసగా ఒక్కొక్కరూ ఇక్కడి మార్కెట్ ను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే తెలుగులో నేరుగా సినిమాలు చేయడానికి కూడా వెనకాడ్డం లేదు.

రీసెంట్ గా ప్రిన్స్ అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఆకట్టుకోవాలని చూశాడు శివకార్తికేయన్. అది పోయింది. అయినా అంతకు ముందు నుంచే అతను తన సినిమాలను తెలుగులో డబ్ చేయిస్తున్నాడు. బట్ కోరుకున్న మార్కెట్ రాలేదు. ఇక ఈ నెల 14న అతని మహా వీరుడు సినిమా విడుదల కాబోతోంది.

అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తెలుగులో అస్సలు సౌండ్ లేదు. రీసెంట్ గా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అడవి శేష్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. బట్ సినిమాకు ఏ మాత్రం బజ్ లేదు.. రావడం లేదు.


శివకార్తికేయన్ కు తమిళ్ లో మంచి క్రేజ్ ఉంది. గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకునే ఇమేజ్ ఉంది. బట్ తెలుగులో ఆ సీన్ లేదు. ఒక వేళ సినిమా సూపర్బ్ అంటే అప్పుడు ఏమైనా కొంత వరకూ చూస్తారేమో కానీ.. క్రేజ్ అయితే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడేమైనా గట్టిపోటీ ఉందా అంటే అదీ లేదు.

మహా వీరుడుతో పాటు బేబీ అనే సినిమా వస్తోంది. ఈ చిత్రానికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆర్టిస్టులకు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునేంత స్టార్డమ్ లేదు. మరోవైపు తమిళ్ నుంచే నాయకుడు అనే సినిమా డబ్ అయింది.

అసలు ఈ సినిమా గురించి ఆరా తీసిన వారు కూడా లేరు. అంటే మహా వీరుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే కొంత వరకైనా సౌండ్ చేసే అవకాశం లేకపోలేదు. మరి తెలుగులో రిలీజ్ చేస్తున్నది ఎవరో కానీ… ప్రమోషన్స్ పరంగా పూర్తిగా గాలికి వదిలేసినట్టున్నారు. లేద�