పాన్ ఇండియా మూవీస్ పై జె.డి. కామెంట్స్ వైరల్

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లోనూ పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా సాగుతోంది. ‘బాహుబలి’ చిత్రమే ఈ ట్రెండ్ కి నాంది పలికింది. ఆ తర్వాత వచ్చిన ‘కె.జి.యఫ్, పుష్ప, కాంతార’ వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన సంచలనం ఎలాంటిదో తెలిసిందో. అయితే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

ఇదే విషయం గురించి ఇటీవల హీరో జె.డి.చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాన్ ఇండియా లెవెల్ లో హిట్టైన ‘పుష్ప, కె.జి.యఫ్, కాంతార’ వంటి సినిమాలు ఆయా భాషల్లోని రూరల్ కంటెంట్ తో రస్టిక్ ఫీల్ తో రూపొందిన చిత్రాలని.. అందుకే అవి అన్ని భాషల్లోనూ హిట్టయ్యాయని అన్నాడు. అయితే.. ఈ సినిమాల హిట్టయ్యాయని.. మన హీరోలు బాలీవుడ్ డైరెక్టర్స్, యాక్టర్స్ తో సినిమాలు చేయడం.. ఫ్లాప్స్ అందుకోవడం జరుగుతుందని జె.డి. తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అయితే.. జె.డి. కామెంట్స్ వెనుక ఆంతర్యం ‘ఆదిపురుష్’ సినిమా గురించేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ప్రభాస్ ఒక్కడే బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్స్ తో ‘ఆదిపురుష్’ సినిమా చేశాడు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. మరోవైపు కాస్త గ్యాప్ తర్వాత జె.డి.చక్రవర్తి మళ్లీ సినిమాలు, సిరీస్ లతో బిజీ అవుతున్నాడు. ఈ ఏడాది జె.డి. నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related Posts