టాలీవుడ్

ఇది పవర్ స్టార్ చేయాల్సిన సినిమానా..?

కొన్ని సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటప్పుడు సినిమాలకు సంబంధించి అనేక మార్పులు కూడా కనిపిస్తాయి. తాజాగా కన్నడలో వచ్చిన ధూమమ్ అనే మూవీ ట్రైలర్ చూసిన చాలామంది ట్రైలర్ అద్భుతంగా ఉందని మెచ్చుకోవాలో.. లేక ఇది పవర్ స్టార్ చేయాల్సిన సినిమా కదా అని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

ఎందుకంటే ఆ చిత్రాన్ని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చేయాల్సింది కాబట్టి. ఆయన గతేడాది సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అతని మరణం కన్నడ పరిశ్రమనే కాక దేశవ్యాప్తంగా ఎంతోమందిని బాధించింది. అతను మరణించిన తర్వాతే మనిషిగానూ ఎంత గొప్పవాడో తెలిసింది. అతను బ్రతికి ఉండగా కేజీఎఫ్, కాంతార ప్రొడ్యూసర్స్ తో రెండు ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యాడు. అందులో ఒకటిగా వచ్చిన యువరత్న బ్లాక్ బస్టర్ అయింది. రెండోది ఈ ధూమమ్ చిత్రమే.

అప్పట్లో అఫీషియల్ గా పునీత్ తో అనౌన్స్ అయింది కూడా. కానీ ఈ లోగానే ఘోరం జరిగిపోయింది. ఆ చిత్రాన్నే ఇప్పుడు మళయాల స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా చేశారు. ఫహాద్ ఫాజిల్ తో పాటు ఆకాశం నీ హద్దురా,2018 ఫేమ్ అపర్ణా బాలమురళి.. ఒకప్పటి లవర్ బాయ్ వినీత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Fahadh Faasil’s Dhoomam with KGF makers launched

కథ పరంగా చాలా కొత్తగా అనిపిస్తోంది. సినిమాల్లో వచ్చే నో స్మోకింగ్ యాడ్ నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. ఆ యాడ్ ను నిజం చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ గా నింపేశాడు దర్శకుడు పవన్ కుమార్ .

ఈ దర్శకుడు గతంలో కన్నడలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన యూ టర్న్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా నచ్చి సమంత తెలుగులో తనే ప్రొడ్యూస్ చేస్తూ రీమేక్ కూడా చేసింది. అలాంటి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 23న కన్నడతో పాటు మళయాలంలోనూ విడుదల కాబోతోంది. ధూమమ్ అంటే పొగ అని అర్థం అని చాలామందికి తెలిసే ఉంటుంది.


హొంబలే పిక్చర్స్ వారి ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. అందుకే ఈ చిత్రాన్ని పునీత్ తో చేసి ఉంటే ఎలా ఉండేదా అని ఆయన అభిమానులు మరోసారి తమ పవర్ స్టార్ ను తలచుకుని ఫీలవుతున్నారు. అందుకే లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనేది.

Telugu 70mm

Recent Posts

జూన్ 14న రాబోతున్న సుధీర్ బాబు ‘హరోం హర‘

యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక…

19 mins ago

మరోసారి ‘గాడ్ ఫాదర్‘ కాంబినేషన్

మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్‘ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ మోహన్ రాజా. మలయాళం చిత్రం ‘లూసిఫర్‘ రీమేక్ గా రూపొందిన…

22 mins ago

బేబి బంప్‌తో దర్శనమిచ్చిన దీపిక పదుకొనె

బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కడం.. పిల్లలను కనడం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులో దీపిక పదుకొనె కూడా…

2 hours ago

‘ఎన్టీఆర్-నీల్’ అనౌన్స్‌మెంట్ తో సస్పెన్స్ లో ‘సలార్ 2’

ఒక సినిమా చేసి.. బోనస్ గా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్…

2 hours ago

బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్?

ఎక్కడ ఎలాంటి పార్టీ జరిగినా ముందుగా గుర్తొచ్చేది సినిమా వాళ్లే. ఇక.. లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ…

3 hours ago

‘గం గం గణేశా’ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ

'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తోన్న మూవీ 'గం గం గణేశా'. ఈ మూవీలో ప్రగతి…

3 hours ago