నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు. అందుకే ఈ కాంబోలో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. బిజినెస్ ఓ రేంజ్ లో అయిపోతుంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ లో దసరా సందర్భంగా విడుదల కాబోతోంది.
అయితే నెక్ట్స్ బాలయ్య మూవీ బోయపాటితోనే ఉంటుందనే ప్రచారం బాగా జరిగింది. అయితే సడెన్ గా బాలయ్య మరో దర్శకుడు బాబీతో సినిమా అనౌన్స్ చేశాడు. దీంతో బోయపాటికి బాలయ్యకు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజమెంత అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ బోయపాటికి ఇప్పుడు నో చెప్పడానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు.
మొదటిది బాలయ్య భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 20న విడుదల చేయాలనుకుంటున్నారు. అదే రోజు బోయపాటి శ్రీను .. రామ్ తో చేస్తోన్న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇది బాలయ్యకు నచ్చలేదని కొందరు చెబుతారు. అంటే రామ్ .. బాలయ్యకు పోటీ అని కాదు. కానీ బోయపాటితో బాలయ్య కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను బట్టి కంపేరిజన్స్ మొదలవుతాయి. అది ఇద్దరికీ ఇబ్బంది. అందుకే వద్దన్నాడట. బట్ రామ్ మూవీని ఆపడం లేదు.
ఇక ఎన్నికలకు ముందు బోయపాటితో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలనేది బాలయ్య ప్లాన్. అయితే బోయపాటి మాత్రం పొలిటికల్ సబ్జెక్ట్ కంటే అఖండకు సీక్వెల్ తీయాలనే ప్రపోజల్ తెచ్చాడట. ఆ మూవీకి సీక్వెల్ చేయడం వరకూ ఓకే. కానీ ఎలక్షన్స్ కు ముందు ఖచ్చితంగా ఓ పొలిటికల్ సెటైరికల్ మూవీ చేయాలని.. అది ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉండేలా చూడాలనుకున్నారు. ఈ విషయంలో బోయపాటి అంతగా ఉత్సాహం చూపించలేదట. దీంతో బాలయ్య ప్రస్తుతానికి బోయపాటిని పక్కన బెట్టి బాబీ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు.
ఈలోగా ఇద్దరి మధ్య ఓ అండర్ స్టాండింగ్ కుదిరితే ఆ చిత్రం 2024 ఆరంభంలో మొదలవుతుంది. ఏదేమైనా అభిమానులు కూడా బోయపాటితోనే నెక్ట్స్ మూవీ అనుకున్నారు. ఇలా జరగడం వెనక వినిపిస్తోన్న ఈ కారణాలు నిజమా కాదా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ఇద్దరి మధ్య ఓ చిన్న గ్యాప్ అయితే వచ్చిందని సన్నిహితులే చెబుతున్నారు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…