ఆదిపురుష్‌ ను అందుకే వదిలేశారా.. ?

ఆదిపురుష్‌.. ప్రస్తుతం ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమా. రామాయణ కావ్యం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా నటించడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే ఈ రాముడు మన సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కనిపించడం లేదు అనే విమర్శలున్నాయి. కానీ నార్త్ వారికి వారి రాఘవుడు వారికి కనిపిస్తున్నాడు.

అందుకే సౌత్ కు మించిన డబుల్ క్రేజ్ నార్త్ లో కనిపిస్తోంది. కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీకి సంబంధించిన ఏ ప్రమోషనల్ పార్ట్ కనిపించడం లేదు. ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. అంతే ఆ తర్వాత మూవీ టీమ్ నుంచి ఒక్క ఇంటర్వ్యూ కానీ ప్రెస్ ఇంటరాక్షన్ కానీ లేవు. మరి ఆదిపురుష్ ని ఇలా ప్రమోషన్స్ లేకుండా ఎందుకు వదిలేశారు అంటే ఆసక్తికరం అని చెప్పలేం కానీ అంతా ఊహించిన సమాధానమే కనిపిస్తోంది.


ప్రస్తుతం ఇండియాలో సినిమాలతో లాభపడాలని బిజెపి చూస్తోంది.తమకు అనుకూలంగా ఉండే చిత్రాలకు ఏకంగా ప్రధాన మంత్రి కూడా సపోర్ట్ చేస్తున్నాడు.ఈ ఆదిపురుష్ కూడా వారి నినాదానికి దగ్గరైన రాముడి కథ కాబట్టి అంతా బిజెపి వారే చూసుకుంటారు. వాళ్లే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి అన్ని చోట్లా కటౌట్స్ కట్టడం వరకూ వారే చూసుకుంటారు అని నిర్మాతలే తెలివిగా ఈ ఎత్తుగడ వేశారు అనుకుంటున్నారు.


జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గరిల్లపోవడం ఖాయం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ట్రెండ్ సౌత్ లో కూడా కొంత వరకూ ప్రతిబింబిస్తుంది అని చెప్పొచ్చు. ఇక పర్టిక్యులర్ గా చెబితే ఈ చిత్రం చాలా వరకూ బిజెపి డైరెక్షన్ లోనే తెరకెక్కిందనే ప్రచారం కూడా లేకపోలేదు. లేదంటే రావణుడి పాత్ర ఒక మతానికి ప్రతీకగా ఎందుకు తీర్చి దిద్దుతారు. ఆయనకు సంబంధించిన ఏ పురాణాల్లో చూసినా ఆ గెటప్ కనిపించదు. రావణుడు కూడా అందగాడేఅనేది రామాయణం చెప్పే మాట.

కానీ అతన్ని ప్రస్తుతం బిజెపి వ్యతిరేకిస్తోన్న ఒక మతం వ్యక్తిలా చూపించే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది. ఇక సీతాపరహరణం అనేది కూడా సౌత్ సినిమాల్లో అత్యంత హుందాగా ఉంటుంది. అదీ కూడా పురాణాల ప్రకారమే. కానీ ఈ చిత్రంలో తాళ్లతో బంధించి కాస్త కౄరంగా తీసుకువెళుతున్నట్టుగా చూపించాడు.

నిజానిఇ సీతను రావణుడు ఎత్తుకుపోతున్నప్పుడు తన గుర్తుగా ఆమె తన ఆభరణాలు వదిలేస్తూ వెళుతుంది. కానీ ఈ యాంగిల్ తీసుకువెళ్లి ఉంటే అది సాధ్యమయ్యేదేనా అనే ప్రశ్న హిందువుల నుంచి కూడా వినిపిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు కంట్రీ మూడ్ కు తగ్గట్టుగా ఆదిపురుష్‌ కు ప్రమోషన్ అక్కర్లేకుండానే రికార్డులు వచ్చేలా ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రమోషన్ బాధ్యత సదరు పార్టీ తీసుకుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు.

Related Posts