పీరియాడిక్ మూవీలో నాంది నరేష్

నాంది సినిమాతో తన పేరు ముందు ఉన్న అల్లరిని తొలగించుకుని అదే ఊపులో వెండితెరపై ఉగ్రం చూపించిన హీరో నరేష్‌. మొదట్లో కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ వారసుడు అనిపించుకున్నాడు. ఆ కామెడీ కొన్నేళ్లకు రొటీన్ అయింది. ఈ విషయాన్ని తను కూడా చాలా ఆలస్యంగా గ్రహించాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఒకప్పుడు యేడాదికి నాలుగైదు సినిమాలు విడుదల చేసిన నరేష్ ఇప్పుడు స్పీడ్ తగ్గించాడు.

నాంది చిత్రంతో తనలోని సిసలైన నటుడిని మరోసారి చూపించాడు. ఉగ్రంతో తను కూడా యాక్షన్ మూవీస్ చేయగలను అనిపించుకున్నాడు. ఈ మూవీ హిట్ కాకపోయినా నరేష్ ఇమేజ్ మార్పుకు ఉపయోగపడింది. అంటే అతన్ని ఈ తరహా పాత్రల్లో కూడా చూడొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే ఇక తన కామెడీ ఇమేజ్ ను పూర్తిగా తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పైగా ఇదో పీరియాడిక్ మూవీ అంటున్నారు.


1990ల ప్రాంతంలో జరిగే కథతో నరేష్ కొత్త సినిమా రాబోతున్నాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో పీరియాడిక్ మూవీ అనగానే అయితే యాక్షన్ లేదంటే థ్రిల్లర్స్ ను ఎక్కువగా చూపిస్తున్నారు. మరి ఇది ఏ జానర్ లో వస్తోందో కానీ నరేష్ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాడు అనే వార్త కన్పార్మ్ అయింది. త్వరలోనేఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూతో పాటు ఇతర అప్డేట్స్ అన్నీ రాబోతున్నాయి.

Related Posts