తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేస్ ఎప్పటికప్పుడు ఉలిక్కిపడేలా చేస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం పెద్ద స్టార్స్. ఇప్పుడు మినీ స్టార్స్. అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చెప్పడానికి వీళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టులే అయినా.. ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో లక్జరీస్ అనుభవివిస్తుంటారు. ఆ లక్జరీస్ కు ఉన్న సోర్స్ తో మనకు అవసరం లేదు. కానీ చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ విషయంలో సమాజానికి కాకపోయినా చట్టానికి వీళ్లు జవాబుదారీలే కదా.
ఇక తాజాగా కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ టాలీవుడ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీస్ లకు దొరికిపోయాడు. ఈ కేస్ లో అతనితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు జ్యోతి, సురేఖా వాణి, వెటరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత వంటి వారి పేర్లు బయటకి వచ్చాయి. అయితే వీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియదు కానీ.. ఆ కేపీతో మాత్రం చాలా క్లోజ్ గా దిగిన ఫోటోస్ బయటపడ్డాయి.
అప్పటి నుంచి వీరు కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో భాగమే అనుకుంటూ అన్ని మీడియా సంస్థలూ రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీనిపై ఆల్రెడీ ఈ కేస్ లో ప్రధానంగా కనిపిస్తూ.. కేపీతో వందల ఫోన్ కాల్స్ మాట్లాడిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి స్పందించింది.
ఇక లేటెస్ట్ గా సురేఖా వాణి కూడా రియాక్ట్ అయింది. ఈ కేస్ తో తనకు ఏం సంబంధం లేదు అని చెప్పింది. దీని వల్ల తన కెరీర్, హెల్త్, ఫ్యామిలీ పాడవుతుంది అంటూ తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది.
విశేషం ఏంటంటే .. ఈ ఫోటోస్ లో సురేఖా వాణి మాత్రమే కాదు.. ఆమె కూతురు కూడా ఉంది. చాలా క్లోజ్ గా ఆ నిర్మాత కమ్ డ్రగ్ పెడలర్ తో తల్లీ కూతురు కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు రజిత కూడా ఉంది.
ఎంత సాన్నిహిత్యం లేకపోతే అంత క్లోజ్ గా ఏకంగా ముద్దులుపెట్టేంత వరకూ వెళతారు అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలా మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులంతా గంప గుత్తగా ఒకేసారి డ్రగ్ కేస్ కు సంబంధించిన వ్యవహారంలో కనిపించడం తెలుగులోనే కాదు.. ఇండియాలోని ఏ సినిమా పరిశ్రమలోనూ ఇప్పటి వరకూ లేదు అనే చెప్పాలి.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…