నారా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నాడు. అప్పటి నుంచి వివిధ రాజకీయ పక్షాలు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మాత్రం ఊహించినంత స్పందన రాలేదు. ఫస్ట్ రాఘవేంద్రరావు రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టాడు.. ఎందుకు స్పందించడం లేదు అని. అటుపై మరికొందరు ముందుకు వచ్చి అరెస్ట్ ను ఖండించారు. కానీ పరిశ్రమగా మాత్రం ఒక్క ఖండన కూడా రాలేదు. దీనిపై రకరకాల విమర్శలు, వ్యాఖ్యానాలూ వెలువడ్డాయి. ఇక ఇదే విషయంపై సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబును అడిగితే ఆయన స్పందన చాలామందిని ఆశ్చర్యపరిచేలా ఉంది. ఓ రకంగా చంద్రబాబు అరెస్ట్ పై మేమెందుకు స్పదించాలి అన్నట్టు నిష్కర్షగా మాట్లాడాడు సురేష్ బాబు. ఇంతకీ సురేష్ బాబు రియాక్షన్ ఏంటంటే..

” ఒక పరిశ్రమగా మేము ఎప్పుడూ రాజకీయాలు, మతాలకు దూరంగా ఉంటున్నారు. ఇది చెన్నైలో ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఎవరికైనా వ్యక్తిగతంగా ఏ పార్టీతో అయినా అనుబంధం ఉంటే అది వారి పర్సనల్ మేటర్. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా. సినిమా పరిశ్రమ నుంచి మేం ఎప్పుడూ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు.. ఇవ్వము కూడా. ఆంధ్రా, తెలంగాణ ఇష్యూలో కూడా ఇండస్ట్రీ ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది రాజకీయాలకు అతీతమైనది. అలాగే నాన్ పొలిటికల్ గా కూడా రియాక్ట్ కావడం కష్టం. ఎందుకంటే ప్రతి కథ వెనక మరో కథ ఉంటుంది. మేమేం రాజకీయ నాయకులం కాదు. మీడియా పర్సన్స్ కాదు. కేవలం సినిమాలను నిర్మించేవాళ్లం.. నిర్మించాలనుకుంటున్నవాళ్లం. ఇలాంటి విషయాలపై స్పందించాల్సి ఉంటే ప్రతి రోజూ దేశంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల స్పందించాల్సి ఉంటూనే ఉంటుంది. అందువల్ల చంద్రబాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ మౌనంగా ఉండటం కరెక్టే అని నేను భావిస్తున్నాను.. అలాగే ఇండస్ట్రీ ఇక ముందు కూడా రాజకీయాలు, మతాలకు అతీతంగానే ఉండాలని కోరుకుంటున్నాను..”.
ఇదీ సురేష్ బాబు రియాక్షన్. సో.. సింపుల్ గా చూస్తే చంద్రబాబు అరెస్ట్ అనేది మా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యవహారం అని కుండ బద్ధలు కొట్టాడు. విశేషం ఏంటంటే.. సురేష్ బాబు తండ్రి రామానాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. వీరి కుటుంబం ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబునాయుడు వరకూ వారికి విధేయంగానే ఉంటోంది. అయినా సురేష్ బాబు ఇండస్ట్రీ మాటగా ఇలా నిక్కచ్చిగా మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

అయితే సురేష్ బాబు నిక్కచ్చిగా మాట్లాడటం వెనక మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలోనే వీరికి విశాఖపట్నంలో స్టూడియో కట్టుకునేందుకు భూములు ఇచ్చాడు. స్టూడియో కట్టారా లేదా అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తే జగన్ ఆ భూములపై కన్నేస్తాడు. ఇప్పటికే వేశాడు కూడా. సో.. ఓ రకంగా ఇండస్ట్రీ మాట అంటూ తన భయాన్ని కూడా వ్యక్తం చేశాడు సురేష్ బాబు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.