డిజే టిల్లు మళ్లీ డేట్ మార్చిండా

2022 బ్లాక్ బస్టర్ మూవీ డిజే టిల్లుకు కొనసాగింపుగా మరో సినిమా మొదలుపెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. సితార బ్యానర్ లోనే రూపొందుతోన్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. డిజే టిల్లులో హీరోయిన్ గా నేహాశెట్టి రాధిక పాత్రలో అదరగొట్టింది. సిజిలింగ్ బ్యూటీతో సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ అయింది తను.అయితే ఫస్ట్ పార్ట్ లో తన పాత్ర ముగిసిపోతుంది. అందుకే ఈ సారి మరో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారు.

అయితే అనపమ ఇప్పటి వరకూ పెద్దగా గ్లామర్ రోల్స్ చేయలేదు. దీంతో ఈ పాత్రకు ఎలా ఫిట్ అవుతుందా అనుకున్నవారికి టీజర్ తో పాటు ఆ మధ్య వచ్చిన టైటిల్ సాంగ్ తో తనేంటో చూపించింది. ఫస్ట్ టైమ్ తను చాలా డోస్ పెంచింది. లిప్ లాక్, క్లీవేజ్ షోస్ కు కూడా సిద్ధమే అన్నట్టుగా సిద్దుతో రొమాన్స్ కు రెడీ అయింది.
ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదని వాయిదా వేశారు.

అక్టోబర్ 6న విడుదల చేస్తాం అని చెప్పారు. అంతకు ముందు వారమే సలార్ వచ్చి ఉంటుంది. దీంతో ఈ డేట్ కూడా సేఫ్ కాదేమో అనుకున్నారు చాలామంది. అయితే తాజాగా సలార్ వాయిదా పడింది కాబట్టి టిల్లు స్క్వేర్ కు పెద్ద ప్లస్ అవుతుందనుకుంటే వీళ్లు ఆ డేట్ నుంచి కూడా తప్పుకున్నారని టాక్. డిజే టిల్లు స్క్వేర్ ను నవంబర్ 10న విడుదల చేయబోతున్నారని టాక్. అదే రోజున వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఉంది. అంతకు ముందు వారం మా ఊరి పొలిమేర 2 విడుదలవుతుంది. మరి సేఫ్ గానే ఉన్న డేట్ మార్చడం వెనక కారణం ఏంటో కానీ ఈ పోస్ట్ పోన్ విషయం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

Related Posts