కన్నడ స్టార్ హీరోయిన్ పై దారుణమైన రూమర్

కన్నడలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ దివ్య స్పందన. మొదట రమ్య అనే పేరుతో నటిగా పరిచయం అయిన తను తర్వాత దివ్య స్పందనగా పేరు మార్చుకుంది. దివ్య స్పందన తెలుగులోనూ కళ్యాణ్‌ రామ్ సరసన అభిమన్యు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో తను రమ్యగానే ఇంటర్డ్యూస్ అయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తను మళ్లీ తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. కన్నడతో పాటు మరికొన్ని తమిళ్ మూవీస్ లోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంది. అందం, అభినయం ఉన్న నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కన్నడలో ఉత్తమ నటిగా అనేక అవార్డ్ లు కూడా గెలుచుకుంది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్.పిగానూ గెలిచింది. తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది.

అలాంటి నటి హఠాత్తుగా కన్నుమూసింది అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో న్యూస్ తెగ హల్చల్ చేసింది. దీంతో ఇది నిజమే అనుకుని చాలామంది అపోహ పడుతున్నారు. ట్విట్టర్ లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్ లో ఉందిప్పుడు. బట్ నిజం కాదు. తను బ్రతికే ఉంది. కాకపోతే ఇండియాలో లేదు.

ప్రస్తుతం దివ్య స్పందన స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. ఈ మేరకు తన ఫ్రెండ్ ఆమెతో కలిసి మాట్లాడినట్టుగా ఓ ఫోటో షేర్ చేసింది. అయితే ఈ వార్తల వెనక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. దివ్య స్పందన ముందు నుంచీ కాంగ్రెస్ లో బలమైన వాయిస్ గానే ఉంది. తన పొలిటికల్ మెంటార్ బిజెపిలో చేరినా.. తను మాత్రం వెళ్లలేదు. ఏదేమైనా ఇలాంటి రూమర్స్ ను గుడ్డిగా నమ్మి తమిళ, కన్నడ మీడియా కూడా అదే పనిగా వార్తలు ప్రసారం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఆమె చనిపోయినట్టు కన్నడ కంటే తమిళ్ మీడియాలోనే ఎక్కువగా వస్తోంది.


ఇక సెలబ్రిటీస్ కు సంబంధించి ఇలాంటి రూమర్స్ కొత్త కాదు. కానీ ఇలా ఏ కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా ఉన్నవాళ్లపైనా రూమర్స్ వస్తేనే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎంత ఆందోళన చెందుతారో అనుభవిస్తే కానీ అర్థం కాదు.

Related Posts