ఏక్ దమ్ నచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు సాంగ్

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. వంశీ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. 1970ల ప్రాంతంలో స్టూవర్ట్ పురం ఏరియాలో పేద్ద దొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు కథగా వస్తోన్న సినిమాగా చెబుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాల్లో స్టూవర్ట్ పురం అంటే దొంగల ఏరియా అన్నట్టుగానే చూపించారు. ఈ సారి అక్కడి ఓ దొంగ కథతో సినిమా చేస్తున్నారు.

రవితేజ సరసన నూపుర్ సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఈ దసరా బరిలో అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. అఫ్ కోర్స్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే ముందు నుంచీ ప్రోజెక్ట్ చేశారు.


ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఐదు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేశారీ పాటను. సినిమాకు జివి ప్రకాష్‌ కుమార్ సంగీతం చేస్తున్నాడు. జీవి అంటే టాలెంటెడ్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇక ఈ మూవీకి అతని సంగీతం బ్యాక్ బోన్ అవుతుందని రవితేజ స్వయంగా కితాబు ఇచ్చాడు. అది నిజమే అన్నట్టుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ తో మెప్పించాడు జీవి ప్రకాష్‌ కుమార్. మరీ గొప్ప ట్యూన్ అని చెప్పలేం. కానీ రెగ్యులర్ సాంగ్ కాబట్టి.. ఓకే అనిపించేశాడు.

హీరోయిన్ ను ప్రేమలో దించేందుకు హీరో చేసే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే పాటలా ఉన్న ఈ గీతాన్ని భాస్కర భట్ల రాయగా అనురాగ్ కులకర్ణి పాడాడు. సాహిత్య పరంగా పూర్తిగా భాస్కరభట్ల శైలి కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ తరహా పాటలు అతను రవితేజకు గతంలో చాలానే రాశాడు. అంచేత సులువుగానే ఫిల్ అయిపోయిందీ సాంగ్. ఆల్బమ్ గా కంటే విజువల్ గా ఎక్కువ నచ్చేలా ఉన్న ఈ పాట వినగానే ఆకట్టుకుంటోంది.

Related Posts