ప్రియదర్శితో ఇంద్రగంటి , శ్రీదేవి మూవీస్‌ కొత్త సినిమా ప్రారంభం

జెంటిల్‌మేన్, సమ్మోహనం చిత్రాల తర్వాత శ్రీదేవి మూవీస్‌ సంస్థలో హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ప్రియదర్శి , రూప కొడువాయుర్‌ జంటగా రాబోతున్న శ్రీదేవి మూవీస్‌ ప్రొడక్షన్‌ నెంబర్ 15 గా ఈ మూవీ గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

‘బలగం’ తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాలగారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా . చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజు (మార్చి 25) నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది” అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.

Related Posts